Samsung Galaxy M30s: భారీ బ్యాటరీతో సాంసంగ్ రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. 6.4 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఇన్ఫినిటీ యూ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, ఎక్సినోస్ 9611 ప్రాసెసర్, 48+8+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ ధర రూ.14,999.
Nokia 7.2: ఆండ్రాయిడ్ వన్ సిరీస్‌లో హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ప్యూర్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉండటం విశేషం. నోకియా 7.2 రియర్ కెమెరా 48+8+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,500 ఎంఏహెచ్. ప్రస్తుతం నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.16,699.
Samsung Galaxy M20: సాంసంగ్ గెలాక్సీ ఎం20 భారీ డిస్కౌంట్లో లభిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.9,999. సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉన్నాయి. రియర్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. సాంసంగ్ గెలాక్సీ ఎం20 బ్యాటరీ 5,000 ఎంఏహెచ్ కాగా ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో.
Asus 6Z: ఏసుస్ 6జెడ్ ఫోన్ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్ కెమెరా ఉండటం విశేషం. 48+13 మెగాపిక్సెల్ మోటరైజ్డ్ రొటేటింగ్ కెమెరా ఉంటుంది. ఇదే కెమెరా రియర్, సెల్ఫీ కెమెరాగా పనిచేయడం విశేషం. ఏసుస్ 6జెడ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మిడ్నైట్ బ్లాక్, ట్విలైట్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. ఏసుస్ 6జెడ్ 6జీబీ+64జీబీ ధర రూ.27,999.
Samsung Galaxy m31: సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే 2,340 x 1,080 పిక్సెల్స్‌తో లభిస్తుంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 64+8+5+5 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. టైప్ సీ పోర్ట్‌తో పాటు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాంసంగ్ వన్ యూఐ 2.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్పేస్ బ్లాక్, ఓషియన్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ ధర రూ.16,499 కాగా 6జీబీ+128జీబీ ధర రూ.17,499.
Nokia 8.1: నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకే కొనొచ్చు. హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.22,999. నోకియా 8.1 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.18 ఫుల్ హెచ్డీ+, 1080x2244 పిక్సెల్స్, స్నాప్‌డ్రాగన్ 710 ఉండటం విశేషం. రియర్ కెమెరా 12+13 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,500ఎంఏహెచ్.
iPhone SE 2020: ఐఫోన్ ఎస్ఈ 2020 ప్రారంభ ధర రూ.42,500. ఐఫోన్ 11 హార్డ్‌వేర్, ఐఫోన్ 8 బాడీ, ఏ13 బయానిక్ చిప్సెట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ 2020 స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్ప్లే 4.7 అంగుళాలు ఉండటం విశేషం. యాపిల్ ఏ13 బయానిక్ చిప్, ఐఓఎస్ 13 తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 7 మెగాపిక్సెల్. 64 జీబీ వేరియంట్ ధర రూ.42,500 కాగా 128 జీబీ వేరియంట్ ధర రూ.47,800. హైఎండ్ వేరియంట్ 256 జీబీ వేరియంట్ ధర రూ.58,300.
Nokia 2.3: నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. నోకియా 2.3 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.2 అంగుళాల హెచ్డీ+ నాచ్ డిస్ప్లే ఉండటం విశేషం. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా13+2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999.