భారత్, చైనా సైన్యం మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలను మరింత పెంచేలా మారింది. (credit - google maps)
2/ 8
ఈనెల 15వ తేదీ సోమవారం రాత్రి జరిగినట్టుగా చెబుతున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయినట్టు ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. (credit - twitter)
3/ 8
గాల్వన్ లోయలో వీరమరణం పొందిన వారిలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నాడు.
4/ 8
అయితే, ఘటన జరిగిన రెండు రోజులైనా, భారత్ అమర జవాన్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే విషయాన్ని దాచిపెడుతోంది. (credit - google maps)
5/ 8
ఈ క్రమంలో చైనాకు చెందిన వారు చాలా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని, లేదా గాయపడి ఉంటారని భావిస్తున్నారు.
6/ 8
ఈ క్రమంలో భారత్, చైనా సైన్యం ఘర్షణలో చైనాకు చెందిన 35 మంది చనిపోయినట్టు అమెరికన్ ఇంటెలిజెన్స్ విశ్వసిస్తోందని యూఎస్ న్యూస్ వెబ్ సైట్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఎంతమంది సైనికులు చనిపోయారనే విషయాన్ని చైనా గోప్యంగా ఉంచుతోందని, ఆ విషయాన్ని బయటపెట్టడం ద్వారా సైన్యంలో మనోధైర్యం దెబ్బతింటుందనే, మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుందనే ఉద్దేశంతో అలా చేస్తోందని యూఎస్ న్యూస్ తెలిపింది .
8/ 8
భారత ఆర్మీ చెప్పిన వివరాల ప్రకారం 20 మంది భారత సైనికులు చనిపోయారు. 43 మంది చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన వాళ్లు మరణించి లేదా గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు. (Image: @globaltimesnews/ Twitter)