MEHUL CHOKSI LETS FIND OUT WHAT HAPPENED IN THE ORIGINAL PNB SCAM MK
అసలు PNB స్కాంలో ఏం జరిగింది...ఎవరీ మెహుల్ చోక్సీ...తెలుసుకుందామా...
పీఎన్బీ స్కాంలో నిందితుడు మెహుల్ చోక్సీ... ప్రస్తుతం ఆయన కరీబియన్ ద్వీప దేశం డొమినికాలో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ‘గర్ల్‌ఫ్రెండ్‌తో సరదాగా గడుపుదామనో, డిన్నర్ కోసమో చోక్సీ ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడు. అక్కడ పోలీసులకు దొరికిపోయాడు.
[caption id="attachment_894762" align="alignnone" width="832"] పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేస్ గురించి తెలుసుకుందాం.
[/caption]
2/ 6
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ డొమినికా రిపబ్లిక్ దేశంలో పట్టుబట్టారు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకును బురిడీ కొట్టించి దేశం వదిలి వెళ్లిపోయారు.
3/ 6
అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (48), అతని మామ, మెహుల్ చోక్సీ( 60) ప్రధాన నిందితులుగా ఉన్నారు.
4/ 6
ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ, ఈడీ పలు చార్జ్ షీట్లను మోదు చేయడంతోపాటు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా పలు విదేశీ, స్వదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి.
5/ 6
గత ఏడాది లండన్‌లో అరెస్టయి, ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
6/ 6
నీరవ్ మోడీతో పాటు పీఎన్బీ స్కాంలో సహ నిందితుడిగా ఉన్న మోహుల్ చోక్సీ...62 ఏళ్ల చోక్సీ అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్ వేశాడు. ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీకి గుర్తించిన డొమినికా పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.