సైటిఫిక్ డెవలప్మెంట్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికి ..ప్రజల్లో మూఢనమ్మకాలు, తాంత్రికపూజలు, మంత్రాలను విశ్వసించే వారే ఎక్కువగా ఉన్నే విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి పరిశోధనలు. మంత్, తంత్రాలు లేవంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికి...ఇంకా వాటిని నమ్మే వాళ్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. (ప్రతీకాత్మకచిత్రం)
గ్రీష్మన్ 95 దేశాల్లోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న 1.4 మిలియన్ల మంది నుండి అత్యంత విశ్లేషణాత్మక, వివరణాత్మక సమాచారాన్ని సేకరించి ఓ నివేదికను రూపొందించారు. అందులో 40 శాతం మంది మంత్రాల ద్వారానే శాపాలు, చేతబడులు తొలగిపోతాయని అంగీకరించినట్లుగా రీసెర్చ్‌లో తేల్చారు. ఇది అత్యంత ప్రమాదకరంగా సూచిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటువంటి మంత్ర విద్య నమ్మేవారు ప్రపంచంలో దాదాపు ప్రతిచోటా ఉన్నారు. స్వీడన్లో కేవలం 9 శాతం మంది మాత్రమే వీటిని విశ్వసిస్తుండగా ట్యునీషియన్లు మాత్రం 90 శాతం నమ్మకం కలిగి ఉన్నారు. మంత్రవిద్యపై విశ్వాసం అనేక రకాల వ్యక్తులు మరియు సమూహాలలో కనిపిస్తుంది, ఉన్నత స్థాయి విద్య మరియు ఆర్థిక భద్రత ఉన్నవారితో సహా, గ్రీష్మన్ చెప్పారు. (ప్రతీకాత్మకచిత్రం)