కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలే హనుమంతుడి (lord hanuman)జన్మస్థలం. ఇవిగో ఆధారాలు అంటూ చెప్పారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం (tirumala tirupati devasthanam) పండితులతో ఏర్పాటు చేసిన కమిటీ దీన్ని నిర్ధారించింది అన్నారు. ఎంతో ప్రత్యేకమైన సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి నిజమైన జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించామన్నారు.
అన్ని ఆధారాలతో నివేదికను తయారు చేశామన్నారు జవహర్ రెడ్డి. ఆ నివేదికను ప్రజల ముందుంచి త్వరలో అభిప్రాయాలను సేకరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా హునమంతుడి జన్మస్థలం తమదేనని ఏ రాష్ట్రం ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ తమ దగ్గర ఆధారాలు ఉంటే ఏ రాష్ట్రమైనా బయట పెట్టవచ్చన్నారు ఆయన.
రామబంటు హనుమంతుడి జన్మ స్తలంపై సర్వత్రా వివాదం నెలకొంది. అసలు ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ? పురాణ ఇతిహాసాలు హనుమ జన్మస్థలం ఎక్కడని చెపుతున్నాయి..? ఈ ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు.. కొందరు మహా రాష్ట్రాల్లో అంటుంటే, మరికొందరు గుజరాత్ అంటూ.. ఇంకొందరైతే జార్ఖండ్ లోనే హనుమంతుడు జన్మిండానికి వాదోప వాదాలు వినిపిస్తున్నారు. కానీ హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించిన ఆధారాలను సైతం బయట పెట్టామంటున్నారు జవహర్ రెడ్డి.
కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన ఆ ఏడు కొండల్లే అసలైన మారుతీ జన్మ స్థలమని చాలారోజల నుంచి టీటీడీ వాధిస్తూనే ఉంది. గతంలో నిరూపిస్తామని చెప్పినా ఆ దిశగా ప్రయత్నాలు ముందుకు పడలేదు. కానీ ఈ సారి హనుమంతుడి జన్మస్థలం పై నిగ్గు తేల్చడానికి వేసిన కమిటీ తమ నివేదికలో అన్ని అంశాలను స్పష్టం చేసింది. త్వరలోనే దీన్ని ప్రజల ముందు పెట్టనున్నారు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయలని ఈవో జవహర్ రెడ్డి కోరారు.
అసలు ఆంజనేయ స్వామి చరిత్ర ఏం చెపుతోంది...? హనుమ పుట్టిన పుణ్యభుమి తిరుమలే అని టీటీడీ రుజువు చేశామంటోంది టీటీడీ. మరి దీనీపై నిపుణులు ఏమంటారో చూడాలి.. ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు తెలియచేస్తాయో లేవో చూడాలి. ఇన్నాళ్లూ తెరపైకి రాని హనుమ జన్మస్థలం ఇప్పుడు రావడికి కారణం కూడా లేదంటున్నారు కొందరు. హనుమ జన్మస్థలం తిరుమల కొండల్లోని జాపాలి తీర్థం అని, జాపాలి తీర్ధంను టీటీడి నిర్లక్ష్యం చేస్తోందని చరిత్రకారులు, భక్తులు చాలా కాలం నుంచి విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికే టీటీడీపీ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది అంటున్నారు.
హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవిఎస్జి హనుమథ్ ప్రసాద్ గ్రంధాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథం ప్రామాణికం అని, స్కంద పురాణంలోను ఇదే అంశాని ప్రస్తావించినట్లు పురాణాలూ చెపుతున్నాయి. పవన సుతుడు, రామ భక్తుడు, అంజనీ పుత్రుని జన్మస్థల వివాదం ఇప్పటిది కాదు. హనుమంతుడి జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ది చెందుతున్నాయి. మరి టీటీడీ చూపించిన ఆధారాలతో అందరూ ఏకీభవిస్తారో లేదో చూడాలి.
మహా మునులు, మహర్షులు రచించిన గ్రంథాలు. వేంకటాద్రి పర్వతంలోనే హనుమంతుడు జన్మించాడని పురాణాలు, వేద గ్రంథాలు చెపుతున్నాయి. వేంకటాచల మహాత్యం, భావిశోత్తర పురాణంలో ఆంజనేయ జన్మస్థలంపై ప్రస్తావించినట్లు వేదపండితులు చెపుతున్నారు. వేంకటేశ్వరుడు కొలువైన శేషాచలంలో హనుమ వైభవం గురించి పూర్తిగా అధరాలు ఉన్నాయి.