1. టెక్ దిగ్గజం అయిన గూగుల్‌తో కలిసి టెలికాం రంగ దిగ్గజమైన రిలయెన్స్ జియో స్మార్ట్‌ఫోన్ రూపొందించింది. JioPhone Next పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది జియో. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్. మరో రెండు నెలల్లో సంచలనాలు సృష్టించేందుకు మార్కెట్లోకి రాబోతోంది ఈ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.
2. కోట్లాది మంది భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్స్‌ని రూపొందించాయి గూగుల్, జియో. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటం ఓ అవసరంగా మారిపోయింది. ఇంటర్నెట్ ద్వారా రోజూ అనేక సేవల్ని ఉపయోగించడం మామూలే. భారతీయుల డిజిటల్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గూగుల్ ఆండ్రాయిడ్ టీమ్ పరిష్కారాలను కనుగొనడం విశేషం.
3. భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా గూగుల్ రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్ అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. యూజర్లు తమకు కావాల్సిన భాషలో కంటెంట్ వినియోగించడం, స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడంతో పాటు అద్భుతమైన కెమెరా ఎక్స్‌పీరియెన్స్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్స్, సెక్యూరిటీ అప్డేట్స్ పొందడం జియోఫోన్ నెక్స్ట్ ద్వారా సాధ్యం.
4. యూజర్లు కోరుకున్న భాషలో సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం. అందులో భాగంగా సరసమైన ధరకే జియో స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ రూపొందించింది. జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మా టీమ్ ఆప్టిమైజ్ చేసింది. లాంగ్వేజ్, ట్రాన్స్లేషన్ ఫీచర్స్, మంచి కెమెరా ఫీచర్స్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అందిస్తాం. -సుందర్ పిచాయ్, గూగుల్, ఆల్ఫబెట్ సీఈఓ
6. ప్రపంచంలోనే సరసమైన ధరకే హైక్వాలిటీ 4జీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్ని అందించడం ద్వారా భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీని జియో ప్రజాస్వామ్యబద్ధం చేసింది. గూగుల్, జియో టీమ్స్ కలిసి సంయుక్తంగా జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించాయి. ఇందులో గూగుల్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్ అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. -ముకేష్ అంబానీ, RIL ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
7. జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్లు తమకు కావాల్సిన భాషలో కంటెంట్ చదవొచ్చు. ఒక్క బటన్ ట్యాప్ చేస్తే స్క్రీన్ పైనే ట్రాన్స్లేషన్ అవుతుంది. రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్ నౌ ఫీచర్స్ అన్ని యాప్స్, మెసేజెస్, ఫోటోలపైనా పనిచేస్తాయి. గూగుల్ అసిస్టెంట్ అన్ని జియో యాప్స్‌కి పనిచేస్తుంది. మైజియోలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, జియోసావన్లో పాటలు వినడం, వెదర్ అప్డేట్ లాంటివన్నీ తెలుసుకోవచ్చు.
8. ఇక గూగుల్, జియో కలిసి ఈ స్మార్ట్‌ఫోన్‌లో హైక్వాలిటీ కెమెరాను అందించనున్నాయి. ఫోటోలు, వీడియోలు స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రి వేళల్లో, తక్కువ వెలుతురు ఉన్నప్పుడు క్లిక్ చేసే ఫోటోల దగ్గర్నుంచి హెచ్డీఆర్ మోడ్ వరకు పలు రకాల కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్‌చాట్ లెన్సెస్ కోసం గూగుల్ స్నాప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.