భారత క్రికెట్ బోర్డుకు (bcci) కాసుల వర్షం కురుపిస్తున్న బంగారు బాతు ఐపీఎల్ బీసీసీకు వేల కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీలకు వందల కోట్ల లాభాలు తెచ్చి పెడుతోంది. మరి భారత స్టార్ ప్లేయర్ల పరిస్థితి ఏంటి? ఈ ఐఐపీఎల్ ద్వారా ఇప్పటి వరకు ఎవరు ఎంత సంపాదించారు? అత్యధిక ఆదాయం సంపాదించిన క్రికెటర్ ఎవరు? ప్రస్తుతం టాప్ లో ఉన్న విరాట్ కోహ్లీ (virat kohli)తొలి సీజన్ లో కనీస ధరకే అమ్ముడైన సంగతి మీకు తెలుసా?
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో పరుగుల మిషన్ గా విరాట్ కోహ్లీకి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ క్రికెట్, బ్రాండింగ్, సోషల్ మీడియా ఇలా నాలుగు చేతులా సంపాదిస్తూ ఆర్జనలో నెంబర్ వన్ గా నిలుస్తున్నాయి. అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్ గా.. వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్ ను తనవైపు తిప్పుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడమే కాదు.. కొత్త కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు. ట్రెండ్ ను ఫాలో అవ్వను సెట్ చేస్తాను అంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఐపీఎల్ లో అయితే ఒక సీజన్ కు అత్యధిక మొత్తం తీసుకుంటున్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే.. బెంగళూర్ జట్టు కోహ్లీని ప్రతి సీజన్ కు నిలుపుకుంటూ వస్తోంది. దీంతో అతడికి సీజన్ కు 17 కోట్లు చెల్లిస్తోంది. 15 కోట్లతో ఆ తరువాత స్థానాల్లో రోహిత్, ధోనీలు ఉన్నారు..
ఒక్క సీజన్ కు కాకుండా ఓవరాల్ గా క్రికెటర్ల ఆదాయం చూస్తే..ఐపీఎల్ లో ఆర్జనలో ధోనీదే (ms dhoni)నెంబర్ వన్ స్థానం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా మ్యాచ్ ఫీజు ఛార్జ్ చేస్తున్న ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ ద్వారా అతనికి ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం 137కోట్ల రూపాయలు. 2021 సీజన్ పూర్తి అయ్యే నాటికి అతడి ఆదాయం 150 కోట్ల రూపాయలు దాటనుంది.
ఇక రెండో స్థానంలో రోహిత్ శర్మ (rohit sharma) ఉన్నాడు. ఆరు సార్లు ఐపీఎల్ విన్నర్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సక్సెస్ ఫుల్ లీడర్ గా.. ప్లేయర్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు. 2013 నుంచి ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ ఐపీఎల్ ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 132 కోట్ల రూపాయలు వెనుకేసుకున్నాడు. ఈ సీజన్ లోనూ సక్సెస్ అయితే ధోనీని దాటేసే అవకాశం ఉంది.
ఇక రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్ గౌతం గంభీర్ (gautam gambhir). ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు ప్లేయర్ గా వీడ్కోలు చెప్పేసిన గంభీర్ ఇప్పటి వరకు భారీగానే ఆదాయం సాదించాడు. ఇప్పటి వరకు గౌతమ్ గంభీర్ 94 కోట్ల రూపాయలు ఆర్జించాడు. గౌతం కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు గంభీర్ ప్రాతినిథ్యం వహించాడు.
సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ (yuvaraj singh).. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా రికార్డులను తిరగరాశాడు. ఒకానొక టైంలో 2008 నుంచి 2019 వరకూ సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణె వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ ఇలా వివిధ జట్ల కోసం ఆడుతూ వస్తున్నాడు.