ప్రపంచంలో భారత్ సహా చాలా దేశాలు.. ప్రారంభంలో బొగ్గుతో నడిచే రైళ్లను తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌లు, కరెంటు ట్రైన్స్, బుల్లెట్ రైళ్లు ఇలా చాలా రకాలు వచ్చాయి. రైల్వేల్లో ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థకు మారాలంటే చాలా ఖర్చవుతుంది. బొగ్గు రైళ్లను ఆపేసి.. పూర్తిగా కరెంటువి తేవాలంటే... అందుకు తగిన మౌలిక వసతుల్ని అభివృద్ధి చెయ్యాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం బాగానే జరిగింది. ఇక ఇప్పుడు వేగవంతమైన రైళ్లు కావాలనే డిమాండ్ పెరుగుతోంది. అందుకే వందే భారత్‌కి వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఐతే... కేంద్ర ప్రభుత్వం.. మరో రకమైన ప్లాన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. (image credit - twitter - @QinduoXu)
విజయవాడ వందే భారత్ రైలు, సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్" width="1200" height="641" /> మన దేశంలో బుల్లెట్ రైళ్లను తేవాలనే ఆలోచన ఏళ్లుగా అలాగే ఉంది. ఎంతో ప్రయత్నిస్తే... కేంద్రం ఈమధ్యనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను తేవగలిగింది. ఫలితంగా రైళ్ల వేగం కొంత పెరిగింది. గంటకు 130 కి.మీ నుంచి 180 కి.మీ వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఐతే.. బుల్లెట్ రైళ్లతో పోల్చితే.. ఈ వేగం చాలా తక్కువే.
చైనా, జపాన్ లాంటి దేశాల్లో బుల్లెట్ రైళ్లు గంటకు 300 నుంచి 500 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్తున్నాయి. అలాంటి రైళ్లను ఇండియాలో తేవాలంటే.. ఇప్పుడున్న మౌలిక వసతుల్ని పూర్తిగా మార్చేయాల్సి ఉంటుంది. పట్టాల మొదలు... స్టేషన్ల వరకూ అంతటా మార్పు రావాల్సి ఉంటుంది. అత్యధిక జనాభా.. అందులోనూ పేద, మధ్య తరగతి వారు ఎక్కువగా ఉండే ఇండియాలో... బుల్లెట్ రైళ్లు అనవసరం అనే భావన కూడా కొందరిలో ఉంది. (image credit - twitter - TheRathore3)
ఇలాంటి పరిస్థితుల్లో జర్మనీ... ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ రైలును తెచ్చింది. ఇది రైల్వే వ్యవస్థలో మరో సంచలనం అనుకోవచ్చు. హైడ్రోజన్ ద్వారా వెళ్లే.. ఈ రైలు వల్ల కాలుష్యం ఉండదు. పదేళ్లుగా ఇదే ఆలోచనతో ఉన్న చైనా.. వెంటనే హైడ్రోజన్ రైలును డిసెంబర్ 2022లో తెచ్చింది. ఇలా తెచ్చిన రెండో దేశంగా నిలిచింది. (image credit - twitter - ErikSolheim)
హైడ్రోజన్ సెల్ ఫ్యూయల్ అనేది చవకైనది. ఆయిల్, కరెంటు, బొగ్గుతో పోల్చితే.. దీని ద్వారా పొల్యూషన్ దాదాపు ఉండదు. అందుకే చైనా వెంటనే ఈ రైలును తమ దేశంలోకి తెచ్చేసింది. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉంటున్న దేశాల్లో చైనా తరచూ టాప్‌లో ఉంటోంది. అందువల్ల ఈ రైళ్లు చైనాకి చాలా అవసరం. దీనికి తోడు ఇదివరకు హైడ్రోజన్ సెల్స్ ధర ఎక్కువగా ఉండేది. ధర తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ సెల్స్ ధర నాటికీ తగ్గుతోంది. ఇది కూడా కలిసొచ్చే ఫాక్టర్. (image credit - twitter - @QinduoXu)
బుల్లెట్ రైళ్లతో పోల్చితే.. హైడ్రోజన్ రైళ్లను తేవడం తేలికే. వీటి కోసం ఇప్పుడున్న టెక్నాలజీని పూర్తిగా మార్చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని చిన్న మార్పులతోనే ఇవి రాగలవు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైళ్లపై ఫోకస్ పెట్టింది. 2023 డిసెంబర్ నాటికి ఇండియాలో హైడ్రోజన్ రైలు వస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈమధ్యే ప్రకటించారు. (image credit - twitter - @QinduoXu)
ఢిల్లీ , ముంబై లాంటి నగరాలు వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే కేంద్రం.. వీటిని తేవాలనుకుంటోంది. ఈ రైళ్లే గనక వస్తే.. అప్పుడు రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాలుష్యం తెచ్చే రైళ్లన్నింటికీ స్వస్తి చెప్పే ఛాన్స్ ఉంటుంది. (image credit - twitter - GermanEmbassy)" width="2000" height="1333" /> జర్మనీ తెచ్చిన హైడ్రోజన్ రైలు కంటిన్యూగా 1600 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఎక్కడా కాలుష్యం ఉండదు. ఇలాంటి రైళ్లు ఇండియాకి అత్యవసరం. ఇప్పటికే ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే కేంద్రం.. వీటిని తేవాలనుకుంటోంది. ఈ రైళ్లే గనక వస్తే.. అప్పుడు రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాలుష్యం తెచ్చే రైళ్లన్నింటికీ స్వస్తి చెప్పే ఛాన్స్ ఉంటుంది. (image credit - twitter - GermanEmbassy)
జర్మనీలోని హైడ్రోజన్ ట్రైన్‌ని ఫ్రాన్స్‌కి చెందిన రైల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆల్స్టామ్ (Alstom) తయారుచేసింది. ట్రైన్ నడిచేందుకు అందులో ఫ్యూయల్ సెల్స్‌ని ఏర్పాటుచేసింది. ఇవి ఆక్సిజన్, హైడ్రోజన్ని కలిపి.. ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో.. నీరు, ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. వాయు కాలుష్యం ఏర్పడదు. (image credit - twitter - moneycontrolcom)
జర్మనీలో రైలు ఒకసారి బయలుదేరితే.. 1600 కిలోమీటర్లు కంటిన్యూగా వెళ్లగలదు. దాని మాగ్జిమం వేగం గంటకు 140 కిలోమీటర్లు. ఇండియాలో ఇప్పుడున్న రైళ్ల వేగంతో పోల్చితే.. ఇది కొంచెం తక్కువే కావచ్చు. ఐతే.. చైనాలో రైలు గంటకు 160కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ప్రపంచ దేశాలన్నీ హైడ్రోజన్ రైళ్లను కోరుకుంటే.. అప్పుడు వీటిపై మరిన్ని పరిశోధనలు జరిగి.. వేగాన్ని పెంచే అవకాశాలు ఎక్కువే. (image credit - twitter - @QinduoXu)
హైడ్రోజన్ ఫ్యూయల్ ద్వారా పనిచేసే రైల్ వెహికిల్స్‌ని హైడ్రెల్స్ (hydrels) అంటారు. హైడ్రోజన్ రైలును జర్మనీ 2018 నుంచి వాడుతూ.. పరీక్షలు జరిపింది. మంచి ఫలితాలు కనిపించాయి. ఒక కేజీ హైడ్రోజన్.. 4.5 కేజీల డీజిల్‌కి సమానం అని... ఆల్స్టామ్ CEO హెన్రీ పోపార్ట్ లాఫార్జ్ తెలిపారు. (image credit - twitter - @QinduoXu)
చైనా 2010 నుంచి హైడ్రోజన్ ట్రామ్స్ తయారుచేస్తోంది. ప్రస్తుతం నడుపుతున్న హైడ్రోజన్ ట్రైన్‌కి 5జీ డేటా ట్రాన్స్ఫర్ టూల్స్ ఉన్నాయి. అలాగే మానిటరింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఈ రైలు వల్ల సంవత్సరానికి 10 టన్నుల డీజిల్ నుంచి వచ్చే కార్బన్ డై ఆక్సైడ్‌ని తగ్గించినట్లు అవుతుందని అంటున్నారు. ఈ లెక్కన రైళ్లన్నీ ఇలాంటివే అయితే.. కాలుష్యం చాలా తగ్గిపోతుంది. అందుకే భారత్ కూడా.. వీటిపై ఫోకస్ పెడుతోంది. అంటే.. ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ రాకపోయినా.. హైడ్రోజన్ రైళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (image credit - twitter - ErikSolheim)