భూమిలోపలి టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి తగులుకుంటూ కదులుతున్నప్పుడు, అవి కొన్నిసార్లు చిక్కుకుపోతాయి. తద్వారా విపరీతమైన పీడనం ఏర్పడుతుంది. కొన్నాళ్లకు ఆ ప్లేట్లు జారిపోయినప్పుడు బలమైన శక్తి తరంగాలు ఏర్పడతాయి. అవే భూకంప తరంగాలు. అవి భూమిని బలంగా చీల్చేస్తాయి. ఫలితంగా భూమి కంపించి భూకంపం వస్తుంది. News18 Graphics)
కదిలే బ్లాకుల శక్తి అంతా ఒక్కసారిగా విడుదల అయినప్పుడు అది క్షణాల్లో భూమిలోపల దూసుకెళ్తుంది. ఎటువైపు వీలు ఉందో అటువైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో అది భూమిని చీల్చగలదు. ఈ శక్తి... చెరువుపై అలల రూపంలో తరంగాలలా ఉంటుంది. అన్ని దిశలలో ఇది ప్రవహిస్తుంది. ఏ ప్రదేశానికి ఎక్కువగా దూసుకెళ్తుందో ఆ ప్రదేశంలో భూ ఉపరితలం కంపిస్తుంది. (News18 Graphics)
దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే... పాలను ఉడికించినప్పుడు శక్తి.. ఆవిరి రూపంలో ఏర్పడుతుంది. ఆ శక్తి బయటకు పోయేందుకు ప్రయత్నిస్తుంది. ఆ పాల గిన్నెపై మనం ఓ ప్లేట్ ఉంచితే.. కాసేపటి తర్వాత ఆవిరి శక్తికి.. ఆ ప్లేట్ కదిలిపోతుంది. తద్వారా ఆ శక్తి బయటకు వెళ్లిపోతుంది. భూకంపం విషయంలోనూ ఇదే జరుగుతుంది. ప్రకంపనలతో భూమి చీలిపోయినప్పుడు... లోపలున్న శక్తి తరంగాలు గాల్లోకి వెళ్లిపోతాయి. అలా అవి వెళ్లిపోయేందుకు భూమిని చీల్చడం వల్ల భూకంపం వస్తుంది. అక్కడ భవనాలు ఉంటే.. అవి కూలిపోయే పరిస్థితి వస్తుంది. (News18 Graphics)