మా వాడు సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు అని అనగానే.. వెంటనే జీతం ఎంత అని అడుగుతుంటారు. జీతాన్ని బట్టే వారి వారి సామర్థ్యాన్ని, స్థోమతను అంచనా వేస్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో వీఆర్వోలు, ఎమ్మార్వోలు మొదలుకుని కలెక్టర్ల వరకు ఎవరెవరికి ఎంత జీతం వస్తుందన్నది తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. టీచర్ల నుంచి పోలీసు బాసుల వరకు ఎవరెవరికి నెలకు ఎంత జీతం వస్తోందన్నది కాస్తో కూస్తో అందరికీ అవగాహన ఉంటుంటుంది. కానీ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ? ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం? వంటి వివరాలు చాలా మందికి తెలియదు. ఆ వివరాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కథనంపై ఓ లుక్కేయండి.
ఇక వాస్తవానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండాల్సింది. నిబంధనల ప్రకారం ఆయనకు నెలకు 3 లక్షల 35వేల రూపాయల జీతం లభిస్తుంది. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అత్యల్ప మొత్తం జీతం పొందుతున్న సీఎంగా జగన్ చివరి స్థానంలో ఉన్నారు.