ANDHRA PRADESH GOVERNMENT ALLOWS BENEFICIARIES TO GET CORONA VACCINE WITHOUT REGISTRATION FULL DETAILS HERE PRN
Corona Vaccine: ఏపీలో ఇలా చేస్తే రిజిస్ట్రేషన్ లేకుండానే కరోనా వ్యాక్సిన్...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) కార్యక్రమం కొనసాగుతోంది. తొలి విడతలో వైద్య సిబ్బందికి, రెండో విడతలో పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు (Covid-19 Frontline Workers) వ్యాక్సిన్ ఇచ్చారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి విడతలో వైద్య సిబ్బందికి, రెండో విడతలో పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు.
2/ 7
ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు.
3/ 7
ఐతే వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తొలుత కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ పై అవగాహన లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలల్లోకి తీసుకొచ్చింది.
4/ 7
వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే అర్హులు తమ ఆధార్ కార్డులు చూపిస్తే చాలు టీకా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
5/ 7
అలాగే ఎంపిక చేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్లు టెస్టుల రిపోర్టులు, డాక్టర్లు ఇచ్చిన మందుల చీటీలు, ఇతర ఆధారాలు చూపిస్తే చాలు టీకా వేస్తారు.
6/ 7
ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా.. టీకా తీసుకోవాలని అనుకునేవారు చూపించిన ఆధారాలతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ ఇచ్చేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేసాలిచ్చింది.
7/ 7
ప్రతి వ్యాక్సిన్ సెంటర్లో నిపుణులైన డాక్టర్లు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్య శ్రీ ట్రస్టు పరిధిలోని ఆస్పత్రుల్లో టీకా వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.