Murder in marriage: పెళ్లింట రక్తపాతం.. బరాత్‌లో యువకుడి దారుణ హత్య
Murder in marriage: పెళ్లింట రక్తపాతం.. బరాత్‌లో యువకుడి దారుణ హత్య
అప్పటి వరకు సందడిగా సాగిన పెళ్లి వేడుకలో.. ఒక్కసారిగా రక్తపాతం జరిగింది. బంధుమిత్రులతో కళకళలాడిన ఆ ఇల్లు.. విషాదంలో మునిగిపోయింది. బరాత్‌లో జరిగిన ఓ చిన్న గొడవ... ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాన్నే తీసింది. పెళ్లి ఊరేగింపులో యువకుడి హత్యతో ఊరుఊరంతా ఉలిక్కిపడింది.
అప్పటి వరకు సందడిగా సాగిన పెళ్లి వేడుకలో.. ఒక్కసారిగా రక్తపాతం జరిగింది. బంధుమిత్రులతో కళకళలాడిన ఆ ఇల్లు.. విషాదంలో మునిగిపోయింది. బరాత్‌లో జరిగిన ఓ చిన్న గొడవ... ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాన్నే తీసింది.
2/ 6
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో యువకుడి హత్యతో ఊరుఊరంతా ఉలిక్కిపడింది.
3/ 6
నిన్న జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో బరాత్ ఘనంగా నిర్వహించారు. వధూవరుల బంధువులతో పాటు మిత్రులు, స్థానికులు ఆటపాటలతో సందడి చేశారు.
4/ 6
లక్ష్మణ్ అనే యువకుడు కూడా అక్కడే ఉన్నాడు. అతడితో ముగ్గురు యువకులు గొడవపడ్డారు. అది కాస్తా పెద్దదై హత్యకు దారితీసింది.
5/ 6
ఆ ముగ్గురు యువకులు లక్ష్మణ్‌ను కత్తితో పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మణ్ మరణించాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
6/ 6
సంఘటనా స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, ఎస్ఐ సుధీర్ పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.