అతని వలన ఇబ్బందులు పడిన ఓ మహిళా ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్‌కు వివరించగా.. వారు అతన్ని టార్గెట్ చేసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి.. అతడు చేసే పాడు పనిని బాహ్య ప్రపంచానికి చూపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి ప్రభుత్వం ఉద్యోగం కూడా పోయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (Image credit : Twitter)
పకడ్బందీగా ఓ లేడీస్ జర్నలిస్టును రోగి మాదిరిగా అతడి వద్దకు పంపించారు. మొదటి రోజు వెళ్లి.. ఆసుపత్రిలో ఉన్న వాతావరణాన్ని గమనించింది. రెండో రోజు ట్రీట్ మెంట్ కోసం అంటూ వెల్లింది. ముందుగానే ఆగదిలో సీక్రెట్ గా కెమెరాలను పెట్టించింది. ఇలా ఆమెతో ట్రీట్ మెంట్ గురించి మాట్లాడుతుండగానే దగ్గరకు వచ్చి కిస్ చేసే ప్రయత్నం చేశాడు. (Image credit : Twitter)
ఇక ఇవన్నీ సీక్రెట్ కెమెరాలో రికార్టయ్యాయి. చివరకు అనుకున్నట్లుగానే చానెల్ కు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆమెను రక్షించి ఆ ఫుటేజీని ఉన్నతాధికారులకు అందజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అతడి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయించారు. ఇంతటి సాహసానికి పాల్పడిన ఆ లేడీ జర్నలిస్టు పేరు మారియాగా గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)