WOMAN TO LICK SPIT FOR MARRYING AGAIN DIVORCED UNOFFICIAL VILLAGE GROUP ORDERS IN MUMBAI VB
Second Marriage: రెండో పెళ్లి చేసుకున్న మహిళపై దారుణం.. కుల పెద్దలంతా కలిసి..
Second Marriage: రెండో పెళ్లి చేసుకున్నందుకు కుల పెద్దలు ఆమెకు దారుణ శిక్ష విధించారు. కుల పెద్దల ఉమ్మిని సదరు మహిళ నాకాలని ఆదేశించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన ఓ మహిళ(35)కు 2011లో వివాహమైంది. మొదట వారి కాపురం బాగానే ఉన్నా తర్వాత దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2015 లో ఆమె విడాకులు ఇచ్చింది. అప్పటినుంచి తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
2019 లో ఆమె మళ్లీ వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన నాథ్ జోగి కమ్యూనిటీ పెద్దలకు నచ్చలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోదరితో పాటు బంధువులను కుల పెద్దలు పిలిపించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
కుల పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నామని.. మేమంతా అరటి ఆకులపై ఉమ్మితే సదరు మహిళ ఆ ఉమ్మిని నాకాలని శిక్ష విధించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
అంతే కాకుండా రూ.లక్ష జరిమానా కూడా కట్టాలని హుకుం జారీ చేశారు. ఇదెక్కడి శిక్ష అంటూ కుటుంబసభ్యులు అడిగినా వారు వినలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
దీంతో మహిళ తీవ్ర మనస్తాపానికి గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)