Mumbai Crime News: ముంబైలో మరో నిర్భయ ఘటన.. 32 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా..
Mumbai Crime News: ముంబైలో మరో నిర్భయ ఘటన.. 32 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా..
Mumbai Crime News: నిర్భయ ఘటన మాదిరిగానే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళపై దుండగులు దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో హత్యలు, అత్యాచారాల లాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్భయ లాంటి ఘటన జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
సభ్యసమాజం తలదించుకునే విధంగా ఆ మహిళపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముంబై నగరంలోని సకినాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
32 ఏళ్ల బాధిత మహిళపై దారుణానికి తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరి కొంత మంది ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ముంబై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సాకి నాకాలోని ఖైరానీ రోడ్ వద్ద తెల్లవారుజామున 3.30 గంటలకు రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ గురించి వారికి ప్రధాన కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే డీసీపీ, అడిషనల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఆమెను ఘట్కోపర్లోని రాజవాడి ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
అతడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష) మరియు 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)