Hyderabad: ఎప్పుడూ చలాకీగా ఉండే లాయర్ శివాని ఎందుకిలా చేసింది? భర్త లొంగుబాటు..
Hyderabad: ఎప్పుడూ చలాకీగా ఉండే లాయర్ శివాని ఎందుకిలా చేసింది? భర్త లొంగుబాటు..
బాధితులకు న్యాయ సహాయం అందించే ఆమెనే బాధితురాలైంది.. కోర్టులో ఎప్పుడూ చలాకీగా ఉండే యంగ్ లాయర్ శివాని చివరికి విగత జీవిగా కనిపించింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనపై హైదరాబాద్ చందానగర్ పోలీసులు చెప్పిన వివరాలివి..
మహిళలపై మానసిక ఒత్తిళ్లు, గృహ హింస, ఇంట్లోనే వేధింపులు ఘటనలకు సంబంధించి హైదరాబాద్లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంతో మహిళా న్యాయవాది తన నిండు ప్రాణాలను తీసుకుంది.
2/ 6
శ్రీవాణి న్యాయవాద విద్యను పూర్తిచేసి ఓ సీనియర్ అడ్వొకేట్ వద్ద జూనియర్ లాయర్ గా పనిచేస్తూ, సొంతగా ఆఫీసు కూడా తెరిచింది. ఐదేళ్ల క్రితం మల్లికార్జున రెడ్డిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. మల్లికార్జున్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చేసేవాడు. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు.
3/ 6
శ్రీవాణి, నల్లగండ్ల ప్లైఓవర్ సమీపంలో స్టాంప్స్ అండ్ వెండర్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. మార్చి 27న ఆమె ఆఫీసు నుంచి మేనమామ రఘు స్టాంప్ పేపర్లను దొంగిలించాడు. ఈ విషయంలోనే భార్యాభర్తలకు పెద్ద గొడవ జరిగింది.
4/ 6
స్టాంప్ పేపర్ల చోరీ విషయమై మేనమామ, ఆయన భార్యతో గొడవలు, ఈ ఉదంతంలో భర్త హెచ్చరికల నేపథ్యంలో మనస్తాపం చెందిన శివాని.. శనివారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా శివాని ఆత్మహత్య చేసుకుంది.
5/ 6
శ్రీవాణి చెల్లెలు వర్షిత అదే కాలనీలో నివాసం ఉంటుంది. శనివారం వర్షిత ఇంట్లో ఒడిబియ్యం వండే కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ శ్రీవాణి, మేనమామ, అత్త, భర్తల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. వీళ్లు మాట్లాడుకుంటుండగానే శ్రీవాణి బిల్డింగ్ పై నుంచి దూకేసింది.
6/ 6
కుమార్తె ఆత్మహత్యకు తన తుమ్మడు రఘు, అల్లుడు మల్లికార్జున్ కారణం అని శ్రీవాణి తల్లి హేమ.. చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం బాబు పుట్టిన రోజుకు ఏర్పాట్లు చేస్తోన్న శ్రీవాణి ఆ విషయం మర్చిపోయి క్షణకావేశంలో ప్రాణాలు తీసుకుందని కుటుంబీకులు రోదిస్తున్నారు.