ఓ వ్యక్తి తన వదినను అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య కేసులో తనను జైలుకు పంపిందని కక్ష గట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
వివరాలు.. సూర్యాపేట జిల్లాలోని రామాపురం గ్రామానికి చెందిన సైదులు 2004లో తన సోదరుడు పిచ్చయ్యను హత్య చేశాడు. ఈ కేసులో మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
అయితే జైలు విడుదలైన తర్వాత.. ఈ కేసులో తనకు సంబంధం లేకున్నా వదిన బయమ్మ తనను ఇరికించిందని పలువురికి చెప్పాడు. ఈ విషయంలో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ క్రమంలోనే శనివారం రాత్రి బయమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. తలపైకొట్టి హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పొలం వద్ద తగులపెట్టాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్ను వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)