దీపావళికి పూజ చేస్తుండగా.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
దీపావళికి పూజ చేస్తుండగా.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
దీపావళి సందర్భంగా ఆ మహిళ లక్ష్మీ దేవికి పూజ చేస్తుంది. పూజ మధ్యలో ఉండగా ఒక దుండగుడు పూజగదిలోకి ప్రవేశించాడు. ఆమె ఒక్కతే ఉండటం చూసి.. దారుణానికి ఒడిగట్టాడు.
దీపావళి రోజు రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీ దేవికి పూజ చేద్దామని పూజ గదిలో పూజ చేసుకుంటున్న ఒక మహిళపై దుండగుడు పెట్రోల్ పోశాడు. రాష్ట్ర రాజధాని జైపూర్ కు సమీపంలో ఉన్న ఏరియాలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
2/ 5
దీపావళి రోజున ఒక మహిళ పూజ చేస్తుండగా.. లేఖ్రాజ్ అనే వ్యక్తి సరాసరి ఆమె ఉన్న చోటకు వెళ్లాడు. ఆమె చూస్తుండగానే చేతిలో పెట్రోల్ బాటిల్ ను ఓపెన్ చేశాడు. అది తీసి ఆ మహిళ మీద పారబోశాడు.
3/ 5
దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాన్ని ఆమె మీద వేశాడు. దీంతో ఆమెకు మంటలు అంటుకున్నాయి. ఒంటిమీద పెట్రోల్ ఉండటంతో మంటలు ఆమెను చుట్టుముట్టాయి. దీంతో ఆమె హాహాకారాలు చేసింది.
4/ 5
నిందితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. నిందితుడు ఇప్పటికే ఆమెను అత్యాచారం చేశాడని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కేసు నమోదైనా పోలీసులు మాత్రం నిందితుడిపై ఇంకా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
5/ 5
కేసు వాపస్ తీసుకోవాలని నిందితుడు ఇప్పటికే పలుమార్లు ఆమెను బెదిరించాడు. తీసుకోకుంటే హత్య చేస్తానని హెచ్చరించాడు. కానీ ఆ మహిళ ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో నిందితుడు అన్నంత పని చేశాడు.