దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మహిళ మృతి స్థానికంగా కలకలం రేపింది. లాల్‌బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో 50-55ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. (Photo:Twitter ani)
ముంబైలో ఇదే తరహాలో మరో కేసు ఇటీవలే కలకలం రేపింది. చించ్‌పోక్లిలో నిర్మాణంలో ఉన్న 12వ అంతస్తులో వెదురు పరంజాలో 19 ఏళ్ల వ్యక్తి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి వేలాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగాల్‌కు చెందిన మసూద్ మియా రంజాన్‌గా గుర్తించారు. ఇతను కూడా చనిపోయే ఒక రోజు ముందు అదృశ్యమైనట్లుగా పోలీసులు తేల్చారు. (Photo:file)