హర్యానాలోని కర్నాల్ జిల్లా సెక్టార్ 32-33 పోలీస్ స్టేషన్లో నియమితులైన మహిళా ఏఎస్ఐ పోలీస్ స్టేషన్లోనే రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓ వివాహిత తన అత్తమామలపై పెట్టిన కేసులో అత్యాచార యత్నంపై విధించిన సెక్షన్లను తొలగించేందుకు నిందితుల వద్ద నుంచి ఏఎస్ఐ ఈ మొత్తాన్ని తీసుకుంది.
2020 నవంబర్ 8న తారావాడి ప్రాంతానికి చెందిన ఒక మహిళ తనకు జండ్ల చౌకీ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లయిన తొలిరాత్రి నుంచే భర్త కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని... ఆ తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని.. ఈ క్రమంలో మామ, బావ తనపై అత్యాచారానికి యత్నించారని సెక్టార్ 32-33 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మహిళ చేసింది.
మహిళ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. అయితే వివాహిత తప్పుడు కేసు నమోదు చేసిందని యువకుడి తరపు బంధువు దర్యాప్తు అధికారి ఏఎస్ఐ సరిత, డీఎస్పీలను కూడా కలిశారు. కానీ అతని మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అనంతరం ఏఎస్ఐ సరిత రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. తనకు రూ. 10 లక్షలు లంచం ఇస్తే యువకుడి కుటుంబసభ్యులపై పెట్టిన అత్యాచారయత్నం వంటి సెక్షన్లను తొలగిస్తామని అతడికి చెప్పింది.
నిందితుల వద్ద నుంచి ఏఎస్ఐ సరిత డబ్బులు డిమాండ్ చేసిన విషయం తెలుసుకున్న బాధిత మహిళ విషయాన్ని విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ సరిత లంచం తీసుకుంటుంటుడగా రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు. నిందితురాలు ఏఎస్సైపై విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సచిన్ మాట్లాడుతూ..బాధితురాలి తరపు వారు ఏఎస్ఐ సరిత-నిందితుల మధ్య జరిగిన కాల్ రికార్డింగ్‌ను తనకు అందజేశారని సచిన్ తెలిపారని చెప్పారు. ఏఎస్ఐ సరిత నిందితులపై అత్యాచారం సెక్షన్లు తొలగించిందేకు రూ.10 లక్షలు డిమాండ్ చేసిందని అనంతరం ఎనిమిది లక్షల రూపాయలకు డీల్ కుదిరిందని, ముందుగా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని, మిగతాది తర్వాత ఇవ్వాలని ఫ్లాన్ చేసుకున్నారని చెప్పారు.