ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది మనిషి జీవితంలో ఎంతలా భాగమైపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క నిద్రిస్తున్న సమయంలో తప్ప మనిషి మెలకువగా ఉన్న సమయం మొత్తం ఫోన్ మనతోనే ఉంటోంది. ఫోన్‌ను వినియోగించడం తప్పు కాదు కానీ.. భార్యాభర్తల బంధాన్ని మర్చిపోయి మరీ ఫోన్లోనే కాలం గడిపేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. అలా భార్య ఫోన్‌తోనే బతుకుతూ తనను నిర్లక్ష్యం చేయడంతో ఓ భర్త ఆమె ప్రవర్తనతో విసుగెత్తిపోయి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పరిధిలో వెలుగుచూసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జోధ్‌పూర్‌కు చెందిన ఇక్బాల్(37) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అతనికి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. వృత్తి రీత్యా ఇక్బాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి ఇక్బాల్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కారణం.. ఇక్బాల్ చూసిన ప్రతిసారి తన భార్య గంటలుగంటలు ఫోన్ మాట్లాడుతూ కనిపించడమే.
అంతసేపు ఫోన్లో మాట్లాడటం మంచిది కాదని, అయినా ఎవరితో రోజూ అంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావని ఇక్బాల్ భార్యను నిలదీశాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ముగ్గురు పిల్లలున్నారన్న విషయం మర్చిపోవద్దని.. వారి గురించి పట్టించుకోకుండా ఫోన్లో గంటలుగంటలు గడుపుతున్నావని భార్యను ఇక్బాల్ ప్రశ్నించాడు.
అయితే.. అతను దూకడాన్ని గమనించిన ఓ లేడీ కానిస్టేబుల్.. ఈతగాళ్ల సాయంతో ఇక్బాల్‌ను కాపాడింది. తనను కాపాడిన వారికి చేతులెత్తి మొక్కిన ఇక్బాల్ ఆత్మహత్యకు యత్నించడానికి కారణం తన భార్యేనని.. జరిగిన గొడవంతా పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు. పోలీసులు ఇక్బాల్ కుటుంబ సభ్యులను, అతని భార్యను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.