ఈరోడ్: కరోనా మహమ్మారి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ భార్య తన భర్త చావుకు కరోనాను అడ్డం పెట్టుకుని పెద్ద డ్రామానే ఆడింది. భర్త తరపు బంధువులను, ఊళ్లో వాళ్లను నమ్మించిన ఆ భార్య పోలీసులకు మాత్రం అడ్డంగా దొరికిపోయింది. ఇద్దరు మగాళ్లతో అఫైర్ పెట్టుకున్న ఆమె వారి సాయంతో భర్తను చంపేసి కరోనా కారణంగా ఊపిరాడక తన భర్త చనిపోయినట్లు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
భర్త సెలూన్‌కు వెళ్లడం, ఇద్దరు ప్రియులతో ఆమె అఫైర్ నడపడం.. కొన్నాళ్లు ఇలా కొనసాగింది. అయితే.. ఇటీవల కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల శ్రీనివాసన్ కూడా ఇంటి వద్దే ఉంటున్నాడు. భర్త ఇంట్లో ఉన్న సమయంలో కూడా ఆ భార్య బుద్ధి మారలేదు. తన ప్రియుళ్లు వెల్లింగిరి, శరవణకుమార్‌లతో ప్రభ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేది.
భర్త శ్రీనివాసన్ ఈ విషయంలో ఆమెను మందలించాడు. దీంతో.. తన భర్త ఉంటే తన ఆటలు సాగవని భావించిన ప్రభ అతనిని చంపి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ విషయాన్ని తన ఇద్దరు ప్రియుళ్లకు చెప్పింది. అందుకు వాళ్లు కూడా అంగీకరించడంతో శ్రీనివాసన్ హత్యకు కుట్రపన్నారు. అనుకున్నట్టుగానే తన ఇద్దరు ప్రియుళ్ల సాయంతో ప్రభ శ్రీనివాసన్‌ను గొంతునులిమి హతమార్చింది.