డబ్బు వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు విచక్షణ కోల్పోతుంటారు. అసలు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా వ్యవహరిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ప్రియుడిపై మోజులో తల్లి, తండ్రి ఉద్యోగం కోసం ఓ కొడుకు కలిసి వేసిన దారుణమైన ప్లాన్.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల భీమ్ రావ్ కార్టే నాలుగు నెలల క్రితం చనిపోయాడు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
బావిలో పడి చనిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంసభ్యులు నమ్మించారు. అయితే ఆయన సన్నిహితులు కొందరు ఆయనది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకోలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అయితే దీనిపై వాళ్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. ఈ పరిణామం చోటు చేసుకోవడంతో మృతి భార్య, ఆమె ప్రియుడు, వారి కుమారుడు పరారయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
భర్త చనిపోతే తనకు ఆయనకు పీఎఫ్ డబ్బులు రావడంతో పాటు ప్రియుడితో కలిసి ఉండేందుకు అడ్డు ఉండదని భార్య ప్లాన్ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇక తండ్రి సర్వీసులో ఉండగా చనిపోతే.. ఆ ఉద్యోగం తనకు వస్తుందని కుమారుడు అనుకున్నాడు. ఇలా వీరి కుట్ర కారణంగా 52 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు.(ప్రతీకాత్మక చిత్రం)