అందుకే విధి నిర్వహణ నిమిత్తం భార్యాభర్తలిద్దరూ వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తోంటే ఆ చిన్నారి తల్లిని మాత్రం నాయనమ్మ, తాతయ్యల వద్ద ఉంచి వెళ్తుంటారు. ఆ పాప ఆలనా పాలనను నాయనమ్మ తాతయ్యలే చూస్తు ఊంటారు. వారంతంలో ఆ భార్యాభర్తలిద్దరూ వచ్చి తమ కూతురిని చూసి, ఆ పాపతో మనస్పూర్తిగా ఆటలాడి తిరిగి భారంగా ఆమెను అక్కడే ఉంచి తిరిగి వెళ్తుంటారు. (ఘటన జరిగిన ప్రాంతంలో దృశ్యం)
ఈ దంపతులిద్దరికీ మూడేళ్ల తన్వీ అనే పాప ఉంది. లీలాకుమార్ శ్రీకాళహస్తిలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితమే రాజేశ్వరికి శిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగాల నిమిత్తం భార్యాభర్తలిద్దరూ వేరువేరు చోట్ల ఉండాల్సి వచ్చింది. (ఘటన జరిగిన ప్రాంతంలో దృశ్యం)
అయితే అదే సమయంలో అటుగా వచ్చిన తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ ఘటనను చూశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. తమ కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని సమకూర్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చారు. (ఘటన జరిగిన ప్రాంతంలో దృశ్యం)