WIFE ALONG WITH THREE CHILDREN WAS KILLED WITH KNIFE BY FATHER IN UP VRY
Crime news : అత్తగారు మందలించారని ఘాతుకం.. ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని సైతం గోంతులు కోసి...!
Crime news : యూపీలోని ఖుషీనగర్లో దారుణం చోటు చేసుకుంది.. మద్యానికి బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతుకోసి చంపడంతోపాటు తాను కూడా విషం తాగాడు.
తాను చేసిన అప్పుల భాధకు నిండు నూరెళ్లు బతకాల్సిన పిల్లలను బలిచేశాడు. తనతోపాటు పిల్లలు కూడా బతికి ఉండకూడదని క్రూరంగా ఆలోచించాడు.. దీంతో ముగ్గురు పిల్లలతో పాటు భార్యను సైతం గొంతులు కోసి చంపాడు.
2/ 6
కాగా నిందుతుడిని కూలి పనులు చేసుకునే జితేంద్ర కుష్వాహగా గుర్తించారు. ఈ ఘటనతో కుద్వా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
3/ 6
నిందితుడు భార్య సహా నాలుగు నుంచి 8 సంవత్సరాలలోపు చిన్నారులను కర్కశంగా చంపడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.