2. ఇండియాలో సిమ్ స్వాప్ మోసాలు కొత్తేమీ కాదు. ఈ మోసాలతో ఇప్పటికే బాధితులు వందల కోట్ల రూపాయలు వరకు నష్టపోయారని అంచనా. సిమ్ స్వాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలను సులువుగా తెలుసుకోగలరు. వాటి ద్వారా ఆన్లైన్లో లావాదేవీలు చేసి నిండా ముంచేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీ వివరాలన్నీ కరెక్ట్‌గా సేకరించిన తర్వాత ఫోన్ పోయిందని, కొత్త ఫోన్ తీసుకున్నామని, కొత్త సిమ్ కార్డు కావాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ని కాంటాక్ట్ చేస్తారు. అప్పటివరకు సేకరించిన వివరాలన్నీ కరెక్ట్‌గా చెప్తారు. దీంతో మొబైల్ కంపెనీలకు ఎలాంటి అనుమానం రాదు. కొత్త సిమ్ కార్డు వచ్చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త సిమ్ కార్డు ఇవ్వగానే పాత సిమ్ డీయాక్టివేట్ అవుతుంది. కొత్త సిమ్ యాక్టివేట్ కాగానే అప్పటివరకు సేకరించిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలతో మనీ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ షాపింగ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఎలాగూ సిమ్ కార్డు తమ దగ్గరే ఉంటుంది కాబట్టి ఓటీపీ అదే నెంబర్‌కు వస్తుంది. దీంతో లావాదేవీలు సులువుగా జరిగిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)