UP BRIDE LOCKED THE GROOM IN LAWS RAN AWAY WITH JEWELLERY AND MONEY AT NIGHT AFTER MARRIAGE SK
Viral Bride: పెళ్లైన రోజు రాత్రి.. వధువు చేసిన పనికి అందరూ షాక్.. రాత్రంతా జాగారమే
Viral Bride: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వివాహాలక సంబంధించి వింత వింత ఘటనలలు తెరపైకి వస్తున్నాయి. పెళ్లి పీటల నుంచి వధువు వెళ్లిపోవడం, వరుడు ఆలస్యంగా వచ్చాడని వేరొక వ్యక్తితో పెళ్లి, తప్పతాగి పెళ్లి కొడుకు డాన్స్‌లు ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. ఐతే యూపీలో ఓ షాకింగ్ ఘటన జరిగింది.
పెళ్లిళ్ల పేరిట ఇటీవల మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు యువతలు అమాయకులను టార్గెట్ చేసి.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అత్తింటి నుంచి డబ్బులు,నగలు ఎత్తుకెళ్తున్న ఘటనలు.. ఉత్తరాదిన ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజా యూపీలోని ఆగ్రాలో కూడా ఇలాంటి మోసమే జరిగింది.
2/ 7
పెళ్లైన రోజు రాత్రి వధూవరులకు శోభనం ఉంటుంది. కానీ ఆ వధువుకు దొంగతనమే పని. వరుడితో పాటు అత్తామామలను ఇంట్లో బంధించి.. నగలు, డబ్బులు, సెల్ఫోన్లతో ఉడాయించింది. ఏప్రిల్ 25న ఆగ్రాలోని షాగంజ్‌లో ఈ ఘటన జరిగింది.
3/ 7
దాదాపు రెండు నెలల క్రితం షాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో తాజ్‌గంజ్‌కు చెందిన ఓ కార్మికుడు పరిచమయ్యాడు. మీరు పెళ్లి సంబంధం కోసం చేస్తున్నారని తెలిసిందని.. తనకు తెలిసిన అమ్మాయి ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయి.
4/ 7
యువతి తరపువారు నిరుపేదలని చెప్పడంతో అబ్బాయి వారే పెళ్లి ఖర్చులు భరించారు. ఏప్రిల్ 25న ఇరుకుటుంబాలు ఆగ్రా నుంచి వరుడి స్వస్థలం గోరఖ్‌పూర్ వెళ్లి.. అక్కడ ఘనంగా వివాహం జరిపించారు. ఐతే పెళ్లైన రోజు రాత్రి వరుడి ఇంట్లో ఊహించని ఘటన జరిగింది.
5/ 7
రాత్రి 12 గంటల సమయంలో పెళ్లి కూతురు ఇంట్లో ఉన్న నగలు, డబ్బులను కొట్టేసింది. భర్తతో పాటు అత్తామామలను ఇంట్లో పెట్టి తాళం వేసింది. అనంతరం గోడ దూకి పారిపోతుండగా వాచ్ మెన్ చూశాడు. అతడిని కత్తితో బెదిరించి.. అక్కడి పారిపోయింది.
6/ 7
అనంతరం వాచ్మెన్ తాళం తీయడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. రాత్రంతా ఆమె కోసం గాలించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
7/ 7
రాజస్థాన్, యూపీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే గ్యాంగ్‌లు చాలానే ఉన్నాయి. అమాయకులను ఎంచుకొని.. వారిని పెళ్లిళ్లు చేసుకుంటారు. అనంతరం ఒకటి రెండు రోజులు ఇంట్లో ఉండి.. ఆ తర్వాత నగలు, డబ్బులతో ఉడాయిస్తున్నారు.