వ్యభిచార కూపం నుంచి ఇద్దరు నటీమణులను పోలీసులు రక్షించారు. డబ్బు ఆశ చూపి నిర్వాహకులు వీరిని వ్యభిచారంలో దింపినట్టుగా పోలీసులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఇక, పోలీసులు రక్షించిన ఇద్దరు నటీమణులు ఇద్దరు పలు దక్షిణాది చిత్రాల్లో నటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
వివరాలు.. ముంబ్రాలోని అమృత్‌నగర్‌కు చెందిన ఒక మహిళ.. నౌపాడా ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తుందని పోలీసులుకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మారువేషంలో ఓ వ్యక్తిని పంపి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే ఇద్దరు నటీమణులను రక్షించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
నిందితులను హసీనా, స్విటీ, విశాల్ అలియాస్ సునీల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వీరు నటీమణులు, మోడల్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
నిందితుల నుంచి రూ. 2,14,015 నగదును, ఖరీదైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)