Sex Racket: బాలీవుడ్ చాలా పెద్దది. ఆ రంగుల ప్రపంచంలో... అన్నీ కలర్ ఫుల్ రంగులే ఉండవు. కొన్ని చీకటి నిశీధి రంగులు కూడా ఉంటాయి. ఆ రంగుల్లో ఒకటి ఈ సెక్స్ రాకెట్. ముంబై నగరానికి కాస్త దూరంలోనే ఈ భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. క్రైమ్ బ్రాంచ్ యూనిట్ రంగంలోకి దిగి... ఐదుగుర్ని అరెస్టు చేసింది. వారిలో ఇద్దరు బాలీవుడ్ నటీమణులు ఉన్నారు.
సిటీ శివార్లలో 5 ఎకరాల ఏరియా ఉంది. అక్కడ ఏదో జరుగుతోందనీ... మాటిమాటికీ కార్లు వస్తున్నాయి, పోతున్నాయనీ... అమ్మాయిలు కూడా ఉన్నారనీ లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదని పోలీసులకు ఎవరో చెప్పారు. సినిమా షూటింగ్ జరుగుతుందేమో అని పోలీసులు అంటే... కాదనీ... ఇంకేదో జరుగుతోందనే అనుమానం తమకు ఉందని చెప్పారు. దాంతో... క్రైమ్ బ్రాంచ్ అలర్ట్ అయ్యింది. కాపు కాసింది. రైడ్ చేసింది. దాంతో... సెక్స్ రాకెట్ సీక్రెట్ రివీల్ అయ్యింది. అదో ప్రైవేట్ సొసైటీ. అందులో ఓ ఫ్లాట్లో ఈ సెక్స్ రాకెట్ నడుస్తోందని ప్రథానా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
పోలీసులు చెప్పిన దాని ప్రకారం... ఆ ఇద్దరు అమ్మాయిలూ... అందంగానే ఉన్నా... సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఖర్చులేమో పెరిగాయి. లాక్డౌన్లో అప్పులు చేశారు. ఇబ్బందులు పెరిగాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ టైమ్లో ఎవరో చెప్పగా... కష్టాల నుంచి బయటపడేందుకు వేరే మార్గం లేక... ఈ వ్యబిచార వృత్తిలోకి వెళ్లామని ఆ అమ్మాయిలు చెప్పారు.
అమ్మాయిలు చెప్పిన దానిలో కొంతవరకూ నిజం ఉంది. కరోనా వచ్చాక... మహారాష్ట్ర తీవ్రంగా దెబ్బతింది. బాలీవుడ్ మూతపడింది. పెద్ద నటులు నెట్టుకు రాగలిగారు కానీ... చిన్న నటులకు కష్టం వచ్చింది. చేయడానికి వారికి నటన తప్ప వేరే పనులేవీ రావు. అబ్బాయిలైతే... ఏ కూరగాయలో అమ్ముకుంటూ... సెటిల్ అయ్యారు గానీ... అమ్మాయిలకు తలనొప్పులు తప్పలేదు. అందువల్ల ఇంకా చాలా మంది ఇలాంటివి చేస్తూ ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఇద్దరు అమ్మాయిలనూ ఈ ఉచ్చులోకి దింపిన అసలు ఏజెంట్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. త్వరలోనే అతన్ని పట్టుకుంటే... మొత్తం డొంక కదులుతుందని పోలీసులు అనుకుంటున్నారు.
ఈ సెక్స్ రాకెట్ చాలా హైటెక్ రేంజ్ది. అమ్మాయిలతో డీల్ కుదిర్చే వారు... కస్టమర్లతో ముందుగా మాట్లాడి... అమ్మాయిల వీడియోలు, ఫొటోలూ చూపిస్తారు. ఆ తర్వాత... ఒక రాత్రికి రూ.2 లక్షలు అడుగుతున్నారు. తాజా అరెస్టు సమయంలో... రూ.1.80 లక్షల చొప్పున ఇద్దరు అమ్మాయిలకూ డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. ఇలా నిత్రాజ్ సొసైటీలో జరుగుతున్న తంతు స్థానికంగా కలకలం రేపింది.