డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో నటి లహరి మద్యం తీసుకున్నట్లు తేలిందా, క్లీన్ చిట్ లభించిందా అనేది వెల్లడికావాల్సి ఉంది. విచిత్రంగా లహరి కారుతో ఢీకొట్టగా గాయపడ్డ వ్యక్తి తరపున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో, ప్రాథమికంగా ఆమెను అదుపులోకి తీసుకునన పోలీసులు.. ఎఫ్ఐఆర్ పై సంతకాలు పెట్టించుకుని ఆమెను స్టేషన్ నుంచి పంపేసినట్లు తెలిసింది.
బాలతారగా వెండితెరపై ‘అర్జున్’ చిత్రంలో కనిపించారు లహరి. ఆ తర్వాత ‘చక్రవాకం’తో సీరియల్ ప్రేక్షకులకు చేరువయ్యారు. బుల్లితెర ‘సౌందర్య’గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ‘ఋతుగీతం’ టెలీ సీరియల్‌తో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్, ఇంకొన్నిటిలో నటిస్తున్నారు..
సీరియల్స్ చేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉన్నారు నటి లహరి. ఇప్పటి వరకూ చేసిన క్యారెక్టర్స్ అన్నీ తనకు ఇష్టమైనవేనని చెబుతారు. ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ విషయానికి వస్తే జనాలు ఆదిరిస్తున్నారు కాబట్టి తన క్యారెక్టర్‌కి ఢోకా ఉండదంటారు లహరి. సీరియల్ రేటింగ్‌ని బట్టి క్యారెక్టర్ మారిపోతూ ఉంటుందని, జనానికి నచ్చి రేటింగ్ వస్తే ఉంచుతారు లేదంటే లేదని ఓ సందర్భంలో చెప్పారు.
సీరియల్స్‌లో కానీ.. రియల్ లైఫ్‌లో కానీ చేదు అనుభవాలు లేవని చెప్పే నటి లహరి.. తొలిసారి ఇలాంటి ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎవరితోనూ గొడవపెట్టుకోనని, గొడవలుపడే వాళ్లకు దూరంగా ఉంటానని, దేన్నీ సీరియస్ గా తీసుకోనని చెప్పే లహరి.. కారును నిర్లక్షంగా తోలడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎవరైనా కావాలని గొడవపెట్టుకోవడానికి వస్తే ఓకే థాంక్యూ అని చెప్పి పక్కకి వచ్చేస్తాని గతంలో చాలా సార్లు చెప్పిన లహరి.. మంగళవారం రాత్రి నాటి ప్రమాదంలో భయంతో వణికిపోయారు. కారుతో బైకును గుద్దిన తర్వాత చిన్న పాటి షాక్ కు గురైనందుకే ఆమె కిందికి దిగలేకపోయారని, ఈ చర్య స్థానికులను మరింత ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.