Kondagattu Temple: కొండగట్టు అంజన్న ఆలయ దొంగలు వీళ్లే..!
Kondagattu Temple: కొండగట్టు అంజన్న ఆలయ దొంగలు వీళ్లే..!
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో దొంగలు చొరబడ్డారు. అర్ధరాత్రి అంజన్న ఆలయంలోకి చొరబడ్డ దుండగులు రెచ్చిపోయారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజిలోని దొంగల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. P.Srinivas,New18,Karimnagar
ఏకంగా 15 కిలోల వెండి నగలతో పాటు అనుబంధ ఆలయాల్లోని విగ్రహాలను దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని తెలుస్తుంది.
3/ 7
ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించారు. అలాగే ఆలయాన్ని మూసివేసి భక్తులతో పాటు ఎవరినీ గుడిలోకి అనుమతించలేదు.
4/ 7
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా సీసీ ఫుటేజిలోని దొంగల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.
5/ 7
చోరీకి పాల్పడ్డ నలుగురు దుండగులకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేశారు. వారి చేతిలో కొన్ని ఆయుధాలు ఉండగా..గుర్తు పట్టకుండా మాస్క్ లు, కర్చీఫ్ వాడారు. ఇక ఆలయ హుండీ, అలాగే కొన్ని నగలు కూడా దొంగలు తీసుకెళ్తున్నట్టు ఈ ఫొటోల్లో కనిపించాయి.
6/ 7
అర్ధరాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయ అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు.
7/ 7
దొంగతనానికి పాల్పడిన వారు స్థానికుల లేక వేరే ప్రాంతం నుండి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రధాన ఆలయంలో చోరీ జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దేవుని గుడికి రక్షణ లేకపోవడంపై అటు భక్తులు, ఇటు సామాన్యులు అధికారులపై సీరియస్ అవుతున్నారు.