షాహిబ్‌గంజ్: ఆమె నలుగురు పిల్లల తల్లి. అతనో పెళ్లి కాని యువకుడు. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పరిస్థితి ఎక్కడ వరకూ వెళ్లిందంటే.. ఇద్దరూ కలిసి ఆ మహిళ ఇంట్లోనే కలిసేవాళ్లు. ఆదివారం అర్ధరాత్రి కూడా అలానే కలిసి ఉండగా.. గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని.. చేతులు కట్టేసి.. చితకబాదారు. ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని షాహిబ్‌గంజ్ జిల్లాలోని రాజామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో యువకుడికి దేహశుద్ధి చేసిన వీడియో వైరల్‌గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ నలుగురు పిల్లల తల్లి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో నాలుగేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఆమె భర్త ఊళ్లో లేనప్పుడల్లా ఆ వివాహిత ఇంటికే యువకుడు నేరుగా వెళ్లేవాడు. అయితే.. ఊళ్లో వాళ్లకు అనుమానం రాకుండా అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇదే మాదిరిగా గత ఆదివారం రాత్రి కూడా ఆ వివాహిత భర్త ఊళ్లో లేడు. ఏదో పని మీద వేరే ఊరు వెళ్లాడు.
భర్త ఆరోజు రాడని తెలుసుకున్న వివాహిత తన ప్రియుడికి ఫోన్ చేసి.. తన భర్త ఇంట్లో లేడని, రావాలని చెప్పింది. ఆమె సిగ్నల్ ఇవ్వడంతో హుటాహుటిన ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే.. ఈ ఇద్దరి వ్యవహారాన్ని గమనించిన గ్రామస్తులు ఆ యువకుడు ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడకు వెళ్లారు. పిల్లలు నిద్రిస్తుండగా ఓ మూసివేయబడిన గదిలోకి ప్రియుడిని తీసుకెళ్లి ఆ వివాహిత నగ్నంగా ఉన్న స్థితిలో ఆ యువకుడితో రాసలీలలు సాగిస్తోంది. వాళ్లిద్దరినీ ఆ స్థితిలో చూసిన గ్రామస్తులు తలుపులు బద్ధలు కొట్టి ఇద్దరినీ బయటకు లాక్కొచ్చారు.
ఆ యువకుడిని చేతులు కట్టేసి విచక్షణారహితంగా చితక్కొట్టారు. పిడిగుద్దులతో దాడి చేశారు. ఆ మహిళను కూడా కొట్టారు. ఈ ఘటనను గ్రామస్తుల్లో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఊళ్లో మహిళను ఆ వివాహితను తిడుతున్న మాటలు ఆ వీడియోలో స్పష్టంగా వినిపించాయి. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో రాజామహల్ స్టేషన్ ఇన్ఛార్జ్ ప్రణీత్ పటేల్ స్పాట్‌కు చేరుకుని ఆ మహిళను, యువకుడిని స్టేషన్‌కు తరలించి విచారించారు.
దాదాపు నాలుగేళ్ల క్రితం సదరు వివాహిత ఆ యువకుడితో ప్రేమలో పడిందని.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని తెలిసింది. ఆదివారం భర్త ఇంట్లో లేకపోవడంతో యువకుడిని వివాహిత పిలిచిందని, ఆ యువకుడు ఆమె ఇంటికి వెళుతుండగా గ్రామంలోని కొందరు యువకులు చూశారని తెలిసింది. దీంతో.. గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.