ఇడుక్కి: ఈతరం యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాలనే తలకిందులు చేస్తున్నాయి. ఏ చిన్న సమస్య ఎదురైనా ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రేమించడం తప్పు కాదు. పెద్దలను ఒప్పించి ఆ ప్రేమను పెళ్లికి బాటగా మార్చుకోవాలి. కానీ.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం, కలిసి బతికేందుకు అవకాశం లేదని కలిసి చనిపోవడం ఏమాత్రం సమంజసం కాదు.
కేరళలో ఓ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం వారి ప్రేమ కథకు ఊహించని ముగింపు పలికింది. కేరళలోని కుమిలీ పట్టణంలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ధనీష్(24), అభిరామి(20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కారణమేంటో తెలియదు గానీ.. ఈ ప్రేమ జంట కుమిలీలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.