Newly Married: ఈ జంటకు పెళ్లి జరిగి ఆరు నెలలయింది.. ఇన్ని రోజుల తర్వాత ఏమైందంటే..
Newly Married: ఈ జంటకు పెళ్లి జరిగి ఆరు నెలలయింది.. ఇన్ని రోజుల తర్వాత ఏమైందంటే..
అనేకల్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లా అనేకల్ పరిధిలో జరిగింది.

2/ 6
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అనేకల్ తాలూకా రాజాపూర్ ప్రాంతానికి చెందిన యశ్వంత్‌కు, బెంగళూరు టీచర్స్ కాలనీకి చెందిన రాణి అనే యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
3/ 6
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యశ్వంత్‌కు అప్పటికే వివాహమైంది. అయితే.. మొదటి భార్యతో మనస్పర్థల మూలంగా ఆమెకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత రాణితో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారు.
4/ 6
ఆరు నెలల క్రితం ఇద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. బంధువులు కూడా పెళ్లికి వచ్చి వధూవరులను దీవించారు. అయితే.. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే రాణికి అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. యశ్వంత్ కూడా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
5/ 6
ఈ క్రమంలో రాణి అత్తారింట్లో శవమై కనిపించింది. యశ్వంత్, అతని కుటుంబం తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాణి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇంట్లో ఉన్న పై గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ రాణి విగతజీవిగా కనిపించింది.
6/ 6
కులాంతర వివాహం చేసుకోవడం యశ్వంత్‌కు, అతని తల్లిదండ్రులకు ఇష్టం లేదని, అయిష్టంగానే తమ కూతురిని ఆ ఇంటి కోడలిగా చేసుకున్నారని రాణి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.