ఆమెకు 30 సంవత్సరాలు. పెళ్లి చేసుకోమని తన తండ్రి ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోలేదు. పెళ్లి విషయం తెచ్చిన ప్రతీసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగుతోంది. ఆమె తల్లిదండ్రులు ఎంత మంచిగా చెప్పిన ఆమె ఏ మాత్రం వినిపించుకోలేదు. ఓ రోజు తండ్రి గట్టిగా అడిగాడు.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి.. అని అడగ్గా సమాధానం మాత్రం ఆమె చెప్పలేదు.
మరోసారి పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. దానికి మాత్రం ఆమె ససేమేరా అనడంతో తండ్రికి కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ బెడ్రూం కి వెళ్లాడు. అక్కడ తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఝారై గ్రామంలో ఆశోక్ వైశ్ (69) కూతురు అంకు వైశ్ (30) తన భార్య నివసిస్తున్నారు.