విలుపురం: ఈ ఇద్దరూ గత మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి పెళ్లికి ఒప్పించాలని భావించారు. ఇరు కుటుంబాలకు వీరి ప్రేమ విషయం చెప్పగా పెళ్లికి అంగీకరించలేదు. దీంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి డిసెంబర్ 30న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే.. యువతి తండ్రి వీరి పెళ్లి విషయం తెలిసి చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో.. ప్రాణ హాని ఉందని, రక్షణ కోరుతూ ఈ కొత్త జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడారు.