ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలానికే ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పెళ్లై ఏడాది కూడా పూర్తికాకముందే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ ఘటన నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. హుజూర్ నగర్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన మౌనిక, నాగరాజు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
వీరిద్దరు గతేడాది పెళ్లి చేసుకున్నారు. అయితే అత్తారింట్లో మౌనికకు వరకట్న వేధింపులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ వేధింపులు భరించలేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మౌనిక మృతిచెందింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఇక, మౌనిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)