Shikhar Dhawan : 'ధావన్ ఆట కనిపించడం లేదా.?' బీసీసీఐ సెలెక్టర్లపై విరుచుకుపడ్డ మాజీ టీమిండియా ప్లేయర్
Shikhar Dhawan : 'ధావన్ ఆట కనిపించడం లేదా.?' బీసీసీఐ సెలెక్టర్లపై విరుచుకుపడ్డ మాజీ టీమిండియా ప్లేయర్
Shikhar Dhawan : ఇక వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేయడం విశేషం. అయితే నిలకడగా రాణిస్తోన్న శిఖర్ ధావన్ ను మాత్రం సెలెక్టర్లు పట్టించుకోలేదు.
వచ్చే నెల జూన్ 9 నుంచి భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa) జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం ఇరు జట్లు కూడా జట్లను ప్రకటించింది.
2/ 6
ఈ సిరీస్ కోసం సీనియర్లు అయిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్ కు తొలిసారి టీమిండియా తరఫున అవకాశం కూడా ఇచ్చింది.
3/ 6
ఇక వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేయడం విశేషం. అయితే నిలకడగా రాణిస్తోన్న శిఖర్ ధావన్ ను మాత్రం సెలెక్టర్లు పట్టించుకోలేదు.
4/ 6
గత ఆరు ఐపీఎల్ సీజన్లలోనూ 400కు పైగా పరుగులు చేసిన ధావన్.. ఈ సీజన్ లో కూడా ఆ మార్కును మరోసారి అందుకున్నాడు. 14 మ్యాచ్ ల్లో 460 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో 700 ఫోర్లు బాదిన తొలి ప్లేయర్ గా కూడా రికార్డు నెలకొల్పాడు.
5/ 6
ఇటువంటి ప్లేయర్ ను టీమిండియాకు సెలెక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించాడు. సెలెక్షన్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
6/ 6
ధావన్ ను సెలెక్ట్ చేయకపోవడం నిరాశను కలిగించిందన్న అతడు.. కళ్లముందు అన్ని పరుగులు చేస్తున్న పక్కన పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో దినేశ్ కార్తీక్ కు అవకాశం ఇచ్చిన వారు శిఖర్ ధావన్ కు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదంటూ పేర్కొన్నాడు.