Girl friend murder : గర్ల్‌ఫ్రెండ్‌తో వివాదం.. క్లాస్‌రూంలోనే గొంతు కోసి హత్య చేసిన ప్రియుడు
Girl friend murder : గర్ల్‌ఫ్రెండ్‌తో వివాదం.. క్లాస్‌రూంలోనే గొంతు కోసి హత్య చేసిన ప్రియుడు
Girl friend murder : కేరళలో అతి దారుణం చోటు చేసుకుంది. గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడిన తోటి విద్యార్థిని ఘర్షణ పడి అక్కడే గొంతు కోసి చంపివేశాడు. అనంతరం ఎక్కడికి వెళ్లకుండా... పోలీసులు వచ్చేవరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత వారికి లొంగిపోయాడు.
యువతి యువకుల మధ్య ప్రేమ వ్యవహారం ప్రియురాలిని చంపేవరకు వెళ్లింది. ఇష్టపడి ప్రేమించుకుని ఆ తర్వాత ఘర్షణకు దిగారు. దీంతో ఒకరు ప్రాణం కోల్పోగా మరోకరు విద్యార్థి దశలోనే హంతకుడిగా మారాడు.
2/ 6
వివరాల్లోకి వెళితే...కేరళ కొట్టాయం జిల్లాకు చెందిన 22ఏళ్ల నిధినా మోల్ స్థానిక సెయింట్ థామస్ కాలేజీలో చదువుతోంది. అక్కడ తనతో పాటే చదువుతున్న అభిషేక్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.(ప్రతీకాత్మక చిత్రం
3/ 6
ఈ క్రమంలోనే శుక్రవారం క్లాస్ రూంలోనే వీరిద్దరూ తీవ్ర ఘర్షణకు దిగారు.. ఈ నేపథ్యంలోనే నిధినాపై ఆగ్రహానికి లోనైన అభిషేక్.. అక్కడే అందుబాటులో ఉన్న పేపర్లు కట్ చేసే కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. దీంతో నిధినా అక్కడికక్కడే మృతిచెందింది.
4/ 6
ఈ ఘటనతో విద్యార్థులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే నిధినాను చంపేసిన తర్వాత అభిషేక్ ఏ మాత్రం భయపడలేదని, ఎక్కడికి పారిపోకుండా పోలీసులు వచ్చేంతవరకూ బెంచీ మీదే కూర్చున్నాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
5/ 6
కాగా విషయాన్ని పోలీసులు చేరవేయడంతో.. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధులు చూస్తుండగానే హత్య చేయడం వెనక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం పోలసులు దృష్టిసారించినట్టు చెప్పారు.
6/ 6
అయితే జరిగిన సంఘటనపై స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే నిందితుడు కూడా లొంగిపోవడంతో కేసు దర్యాప్తును త్వరలోనే పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు.