ఆ తర్వాత వారిని నెమ్మదిగా మాటల్లో పెట్టి అక్కడున్న భారీ ఆభరణాలను కొట్టేశారు. ఆభరణాలంటే ఏదో లక్ష, పది లక్షలు విలువ చేసేవి అనుకుంటే పొరపాటే. ఆ దొంగలు దోచుకున్న మొత్తం వజ్రాల విలువ అక్షరాలా 15 మిలియన్ల యూరోలు. అంటే మన కరెన్సీలో రూ. 132 కోట్ల పైమాటే. వీటిని ఎత్తుకుపోయిన దుండగులు.. స్పెయిన్ నుంచి ఫ్రాన్స్ కు పారిపోయారని పోలీసులకు తెలిసింది.
దీంతో ఇరు దేశాల పోలీసులతో పాటు ఇంటర్ పోల్ కూడా వజ్రాల దొంగల కోసం వేట సాగించింది. ఈ క్రమంలో ఫ్రాన్స్ లోని పారిస్ కు సమీపంలో ఉన్న ఒక నగరంలో వాళ్లు దోచేసిన వజ్రాలను అమ్ముతుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.