అమ్మాయి కోసం నెట్లో వెతికాడు .. అడ్డంగా బుక్కయ్యాడు
అమ్మాయి కోసం నెట్లో వెతికాడు .. అడ్డంగా బుక్కయ్యాడు
ఇంటర్నెట్ రెండుపైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడకపోతే.. చాలా సమస్యలు వస్తాయి. అమ్మాయి కోసం వెతికిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఏమైందో తెలుసుకుందాం.
తెలంగాణలో జరిగిన ఘటన ఇది. చందానగర్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి తరచూ డేటింగ్ సైట్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. వాటికి ఎట్రాక్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో వేశ్యల కోసం ఇంటర్నెట్లో వెతికాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
డిసెంబర్ చివరి వారంలో ఇది జరిగింది. కాల్ గర్ల్స్ కోసం కాసేపు వెతికిన తర్వాత.. ఓ వెబ్సైట్లో కాల్ గర్ల్ కావాలా.. అని ఓ లింక్ ఉంది. తనకు కావాల్సిన లింక్ దొరికింది అనుకున్న ఆ ఉద్యోగి దాన్ని క్లిక్ చేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
వెంటనే ఓ వెబ్ సైట్ ఓపెన్ అయ్యింది. వాట్సాప్ నంబర్‌తో లాగిన్ అవ్వమని అందులో ఉంది. వెంటనే తన వాట్సాప్ నంబర్ ఇచ్చాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
కొన్ని సెకండ్లకే అతని వాట్సాప్ నంబర్‌కి వెల్కమ్ అంటూ మెసేజ్ వచ్చింది. హాయ్ అయామ్ పటేల్ చార్మి అని ఓ వ్యక్తి తనను పరిచయం చేసుకొని.. చాటింగ్ మొదలుపెట్టాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అతను కొందరు అమ్మాయిల ఫొటోలు పంపి.. వీళ్లలో ఎవరు కావాలో ఎంచుకోండి అని చెప్పాడు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓ అమ్మాయిని ఎంచుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
తర్వాత.. ఆమెను బుక్ చేసుకోవడానికి రూ.510, ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.5,500, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800 ఇలా రకరకాల కారణాలు చెబుతూ మొత్తం రూ.1.97 లక్షలు తీసుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఇంత మనీ తీసుకున్న తర్వాత.. ఇంకా ఏవో కారణాలు చెబుతూ మనీ అడుగుతుంటే.. చిరాకొచ్చిన ఉద్యోగి.. వాట్సాప్ చాటింగ్ ఆపేసి.. ఆ నంబర్‌కి కాల్ చేశాడు. ఆ నంబర్ రింగ్ అయినట్లే అయ్యి.. స్విచ్ఛాఫ్ అయ్యింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
తాను మోసపోయానని గ్రహించిన ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. సైబరాబాద్.. సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి విషయం చెప్పాడు. కేసు రాసిన పోలీసులు... ఆన్లైన్లో ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఉంటారన్న పోలీసులు.. అపరిచిత లింకులను క్లిక్ చెయ్యవద్దని కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)