గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో బర్త్‌డే వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ నగర పోలీస్ కమీషనర్.
బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ముఖానికి కేక్ పూసినా, ఫోమ్ స్ప్రే వాడినా... వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షిస్తామని సర్క్యూలర్ జారీ చేశారు.
పుట్టినరోజు వేడుకలపై ఇలాంటి కఠిన ఆంక్షలు పెట్టడానికి కారణం అక్కడ కొన్నిరోజుల కిందట జరిగిన ఓ సంఘటనే!
సూరత్‌లోని ఇమాస్ రోడ్డులో కొంతమంది యువతీ, యువకులు కలిసి ఓ వ్యక్తి బర్త్‌డే వేడుకను ఘనంగా నిర్వహించారు.
[caption id="attachment_200728" align="alignnone" width="875"] అయితే వేడుకల్లో పాల్గొన్నవారంతా ముఖానికి కేక్ పూసుకుని, స్ప్రే కొట్టుకుంటూ రచ్చరచ్చ చేశారు.
కోడిగుడ్లు విసురుకుంటూ రోడ్డు మొత్తం నాశనం చేశారు. ఈ వేడుకల కారణంగా రోడ్డుపై చాలా వాహనదారులు పడిపోయారు. కొందరికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ సంఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదులు అందడంతో బర్త్‌డే పార్టీ నిర్వహించిన వారిని అదుపులోకి తీసుకుని... ఇలా ఆంక్షలు విధిస్తూ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేస్తామని హెచ్చరికలు పంపారు పోలీస్ అధికారులు.