తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మధుప్రియ అంటే తెలియని వారుండరు. ఆడపిల్లనమ్మా.. పాటతో ఆమె చిన్నప్పుడే చాలా ఫేమస్ అయ్యారు.(Photo: Facebook) అనంతరం.. తెలంగాణ ఉద్యమంలోనూ ఆడిపాడి ప్రజల్లో చైతన్యం నింపారు మధుప్రియ.(Photo: Facebook) బిగ్ బాస్-1లోనూ ఆమె పాల్గొన్నారు. కానీ కొన్ని రోజులకే ఆమె షో నుంచి బయటకు వచ్చేశారు.(Photo: Facebook) ప్రస్తుతం సినిమా పాటలతో పాటు, వివిధ పండగల సందర్భంగా ప్రత్యేక పాటలు పాడుతూ తన ప్రత్యేకతను చాటుతున్నారు మధుప్రియ.(Photo: Facebook) ఫిదా సినిమాలోని వచ్చిండే పాటను తనదైన శైలిలో పాడి మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె.(Photo: Facebook) అయితే ఆమె తాజాగా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి మరో సారి వార్తల్లోకి ఎక్కారు.(Photo: Facebook) గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజులుగా తనను సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.(Photo: Facebook) దీంతో తాను మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నానని పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు మధుప్రియ.(Photo: Facebook) తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.(Photo: Facebook) సింగర్ మధుప్రియ(Photo: Facebook)