Retired Highcourt Judge Nuthi Rammohan Rao assaults Sindhu Sharma : ఇన్నాళ్లు తనపై ఇంత దాడి జరుగుతున్నా.. తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ కోసమే భరిస్తూ వచ్చానని.. ఇక తనవల్ల కాదని నిర్ణయించుకున్నాకే దాడి దృశ్యాలను బయటపెట్టానని సింధుశర్మ చెప్పారు.
రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నూతి రామ్మోహన్ రావు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన కోడలు సింధు శర్మ సంచలన వీడియో బయటపెట్టారు. భర్త వశిష్ట,మామ రామ్మోహన్ రావు,అత్త జయలక్ష్మి ఆమెపై దాడి చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2/ 7
ఏప్రిల్ 20వ తేదీ తన జీవితంలో కాళరాత్రి అని.. అత్తింటివాళ్లు తనను నరకయాతన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.కొట్టరాని చోట్ల కొట్టి దుస్తులు చించివేశారని వాపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లమని వేడుకోగా పిచ్చాసుపత్రికి తీసుకెళ్తామన్నారని చెప్పారు.
3/ 7
2012లో తనకు పెళ్లయిన నాటి నుంచి ఏడేళ్లుగా తాను ఏడవని రోజు లేదని.. అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక తనపై వేధింపులు మరింత పెరిగాయని ఆరోపించారు.
4/ 7
ఆస్పత్రికి తీసుకెళ్లమని ఎంతో వేడుకున్న తర్వాత కొట్టుకుంటూనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపారు. చిరిగిన దుస్తులతోనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా... సింధు శర్మ ఆస్పత్రి సిబ్బందిని అఫ్రాన్ అడిగి చుట్టుకున్నట్టు తెలుస్తోంది.
5/ 7
అపోలో ఆస్పత్రిలో ఓ మహిళా డాక్టర్ సింధు శర్మ ఒంటిపై గాయాలను చూసి ఆశ్చర్యపోయారు. చెప్పరాని చోట్ల గోళ్లతో ఆమెను రక్కిన గాయాలు,వీపుపై వాతలు తేలిన గుర్తులు ఉన్నట్టు గుర్తించారు.ఆమె చొరవతోనే తనపై దాడి ఫుటేజీని బయటపెట్టినట్టు తెలుస్తోంది.
6/ 7
ఇన్నాళ్లు తనపై ఇంత దాడి జరుగుతున్నా.. తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ కోసమే భరిస్తూ వచ్చానని.. ఇక తనవల్ల కాదని నిర్ణయించుకున్నాకే దాడి దృశ్యాలను బయటపెట్టానని సింధుశర్మ చెప్పారు.
7/ 7
కోర్టుల్లో కేసులు వేస్తున్నా.. నూతి రామ్మోహన్ రావు తన పలుకుబడితో వాటిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ప్రభుత్వం చొరవ చూపి తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.