పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్లా జిల్లాలోని మెరల్ పంచాయతీ పరిధిలోని కుదర్ అనే గ్రామంలో సొమరి దేవి అనే వివాహిత ఉంది. ఆమె భర్త నాలుగు నెలల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఆమె అదే గ్రామానికి చెందిన కుంభకరన్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఒకరోజు ఇద్దరూ గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో కలుసుకున్నారు.
ఆ సమయంలో ఇద్దరూ శారీరకంగా కలిశారు. అప్పటి నుంచి తనతోనే ఉండాలని ఆ మహిళ యువకుడిపై ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోవాలని, భార్యాభర్తలుగా కలిసి ఉందామని అతనికి తేల్చి చెప్పింది. లేదంటే.. తనపై అత్యాచారం చేశావని ఊర్లో వాళ్లకు చెబుతానని ఆ యువకుడిని హెచ్చరించింది. అతని గురించి ఎక్కడ బయటపెడుతుందోనన్న భయం కుంభకరన్ను వెంటాడింది. ఆ ఆందోళనలో ఏం చేయాలో పాలుపోలేదు. క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను చంపేయడం తప్ప వేరే దారి లేదని భావించాడు.
కేవలం క్షణిక సుఖం కోసం మాత్రమే ఆమెతో చనువుగా మెలిగిన కుంభకరన్కు ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. దీంతో.. అవకాశం కోసం ఎదురుచూసిన కుంభకరన్ ఆమెను నమ్మించి కలుద్దామని చెప్పి ఒక దగ్గరకు పిలిచాడు. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. అయితే.. సదరు మహిళ పెళ్లి ప్రస్తావన తేవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. అప్పటికే ఆమెను చంపేయాలని భావించిన కుంభకరన్ గొంతు నులిమి హత్య చేశాడు.
ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత చేతులూ, కాళ్లూ కట్టేసి బావిలో పడేశాడు. గ్రామస్తుల్లో కొందరు బావిలో శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఆమె మృతదేహాన్ని వెలికి తీయించారు. చంపేసి బావిలో పడేశారని పోలీసులకు అర్థమైంది. ఊరిలో ఆమె గురించి విచారించగా.. ఆమె కుంభకరన్తో చనువుగా ఉండటాన్ని తాము చూశామని కొందరు చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటపడింది.
ఆమెను హత్య చేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. భర్త చనిపోయిన నాలుగు నెలలకే వివాహేతర సంబంధం మోజులో పడి క్షణిక సుఖం కోసం వెంపర్లాడి దేవి ప్రాణాలు పోగొట్టుకుంది. క్షణిక సుఖం కోసం ఓ భర్త లేని మహిళ జీవితంలోకి ప్రవేశించి.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని ఓ యువకుడు బంగారం లాంటి భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకుని కటకటాల పాలయ్యాడు.