శుక్రవారం సాయంత్రం సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో మెగా హీరో తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే అతి వేగంతో పాటు రోడ్డుపై ఇసుక ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ మద్యం సేవించి లేడని నిర్థారణ అయ్యింది.
ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఖరీదైన స్పోర్ట్స్ బైక్ గురించి చాలామంది ఆరా తీస్తున్నారు.
అయితే ఈ ట్రైంప్ కంపెనీకి చెందిన ఈ స్పోర్ట్స్ బైక్‌ను కొద్ది నెలల క్రితం స్వయంగా సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు.
ఈ బైక్‌పై అప్పుడే ఆయన మనసు పారేసుకున్నారు.
ఈ బైక్‌నే సొంతం చేసుకుని వాడుతున్నారు.
అయితే దురదృష్టవశాత్తు ఈ బైక్ మీద ప్రయాణిస్తున్న సమయంలోనే ఆయన యాక్సిడెంట్‌కు గురయ్యారు.
...