IT Employee: రోజూలానే బైక్‌పై ఆఫీస్‌కు బయల్దేరిన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇలా అవుతుందని ఊహించలేదు..
IT Employee: రోజూలానే బైక్‌పై ఆఫీస్‌కు బయల్దేరిన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇలా అవుతుందని ఊహించలేదు..
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన అతని కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన అతని కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రెండేళ్ల క్రితమే రోహిత్‌కు వివాహమైంది. ఏడాది వయసున్న పాప కూడా ఉంది.
2/ 6
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రోహిత్ రోజూలానే యధావిధిగా మంగళవారం ఉదయం ఆఫీస్‌కు బైక్‌పై బయల్దేరాడు. హెచ్ఎస్ఆర్ లే అవుట్ వద్దకు వెళుతూ ఉన్నాడు.
3/ 6
వాటర్ ట్యాంకర్ పక్కగా రోహిత్ వెళుతున్నాడు. ఆ సమయంలో ట్యాంకర్ డ్రైవర్ ఉన్నట్టుండి వాహనాన్ని ఎడమ వైపుకు పోనిచ్చాడు. దీంతో.. ఎడమ పక్కన వెళుతున్న రోహిత్ బైక్ అదుపు తప్పింది.
4/ 6
రోహిత్ ట్యాంకర్ వీల్ కింద పడిపోయాడు. చక్రం మీద నుంచి పోవడంతో రోహిత్ స్పాట్లోనే తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పారిపోతున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
5/ 6
భర్త చనిపోయిన సంగతి తెలిసి రోహిత్ భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అతని తల్లిదండ్రులు తమకు ఎందుకింత కడుపు కోత మిగిల్చావని ఆ భగవంతుడిని నిర్వేదంతో ప్రశ్నించారు.
6/ 6
ఏడాది వయసున్న పాపకు తండ్రి చనిపోయాడని, ఇక మీ నాన్న ఎప్పటికీ రాడని ఎలా చెప్పాలని గుండెలవిసేలా రోదించారు. రోహిత్ తండ్రి శ్రీనివాస్ కొడుకును తలచుకుని దు:ఖించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.