Sandal Smuggling: కర్చీఫ్‌పై చందనం స్మగర్ల సందేశం.. దాన్ని చూసి పోలీసులు షాక్.. ఏం రాశారంటే..
Sandal Smuggling: కర్చీఫ్‌పై చందనం స్మగర్ల సందేశం.. దాన్ని చూసి పోలీసులు షాక్.. ఏం రాశారంటే..
Sandal Smugglers: ఎర్రచందనానికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఈ కలప కోట్ల వర్షం కురిపిస్తోంది. అందుకే స్మగర్లు వీటి కోసం ఎగబడుతున్నారు. అటవీశాఖ అధికారులపై దాడులు చేసైనా సరే.. నరుక్కొని తీసుకెళ్తున్నారు. శేషాచలం అడవులే కాదు.. గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలోనూ ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉండే చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు.
గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా ఇడర్ తాలుకాలోని వాసాయ్ గ్రీన్ బెల్ట్‌లో చందనం చెట్లు చాలా ఉన్నాయి. ఈ గ్రీన్ బెల్ట్‌పై కన్నేసిన స్మగర్ల ముఠా కొన్ని రోజులుగా మంచి గంధం చెట్లను నరికి తరలించుకుపోతోంది.
2/ 7
గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా ఇడర్ తాలుకాలోని వాసాయ్ గ్రీన్ బెల్ట్‌లో చందనం చెట్లు చాలా ఉన్నాయి. ఈ గ్రీన్ బెల్ట్‌పై కన్నేసిన స్మగర్ల ముఠా కొన్ని రోజులుగా మంచి గంధం చెట్లను నరికి తరలించుకుపోతోంది.
3/ 7
రాజస్థాన్‌కు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. మరికొందరు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయారు. స్మగ్లర్ల నుంచి రూ.7లక్షలు విలువచేసే.. 119 కిలోల చందనంను స్వాధీనం చేసుకున్నారు.
4/ 7
చందనం చెట్లను నరికిన తర్వాత.. వాటిని ముక్కలుగా చేసి ప్యాకింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చివారిని పట్టుకున్నారు. మరికొందరు మాత్రం పోలీసు గళ్లు గప్పి పరారయ్యారు.
5/ 7
ఐతే ఘటనా స్థలంలో పోలీసులకు ఓ హ్యాండ్ కర్చీఫ్ దొరికింది.దానిపై హమ్ నహీ సుధారేంగే.. అని రాసి ఉంది. అంటే మేమే బాగుపడం.. అని దాని అర్ధం. 'మీరు ఎన్ని సార్లు పట్టుకున్నా.. మేము మారము.' అని పేర్కొన్నారు. దానిని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.
6/ 7
వాసాయ్ గ్రామ పరిధిలోని గ్రీన్ బెల్ట్‌లో ఇప్పటి వరకు 50కి పైగా చందనం చెట్లను నరికినట్లు పోలీసులు తెలిపారు. వీరు చందనం ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
7/ 7
రాజస్థాన్ నుంచి రైతు కూలీలుగా గుజరాత్‌లోకి వచ్చారని పోలీసులు వెల్లడించారు. ఉదయం పొలం పనులు చేస్తూ.. రాత్రి పూట చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు.ఇక నుంచి వీరి ఆటలు సాగవని స్పష్టం చేశారు.