బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన అక్కాచెల్లెళ్లలో మమతా దేవీ ఎనిమిది నెలల గర్భంతో ఉండగా.. కమ్లేశ్ తొమ్మిది నెలల నిండు గర్భిణి. మృతురాళ్ల బంధువు హేమరాజ్ మీనా చెప్పిన వివరాల ప్రకారం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం ముగ్గురు కోడళ్లనూ అత్తింటివారు వేధించసాగారు.
అత్తింటివారి కట్నం వేధింపులు భరించలేకే తమ బిడ్డలు, పిల్లతో సహా ఆత్మహత్య చేసుకున్నారని మృతురాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే అవతలివాళ్లు కాస్త పలుకుబడి గల వ్యక్తులు కావడం, స్థానిక ఎమ్మెల్యేకు దగ్గరివాళ్లు కావడంతో ఘటనపై పోలీసులు సరిగా స్పందించడంలేదని, దీంతో మహిళా కమిషన్ను ఆశ్రయించామని మృతురాళ్ల బంధువులు చెప్పారు.