నేటి యువత వింత పోకడలకు పోతున్నారు. పెళ్లికి ముందే తప్పటడుగులు వేస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్ అంటూ పాశ్చాత్య పోకడలకు పోతున్నారు. అయితే, కొన్ని సార్లు.. అమ్మాయిలు.. అబ్బాయిలు ఒకరిని మరోకరు అర్థం చేసుకోవాలని అనుకుంటూ ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఒకటే దగ్గర గడుపుతున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్న.. ఆ తర్వాత.. వీరి మధ్య గొడవలు సంభవిస్తున్నాయి.
అయితే, కొందరు ఫ్రీడం పేరుతో విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్ తర్వాత.. తమ మధ్యలో సఖ్యత సరిగ్గాలేదని విడిపోతున్నారు. మరికొందరు పెళ్లి చేసుకుంటామని చెప్పి, కొన్ని రోజుల పాటు అమ్మాయిలతో తమ శరీర వాంఛను తీర్చుకుంటున్నారు. వారిని తమ అవసరాలకు ఉపయోగించుకుని ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి.
[caption id="attachment_1353806" align="alignnone" width="525"] పూణెలోని బట్టల షోరూమ్ లో విష్ణు అనే యువకుడు సెల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి షాపులో ఒక కస్టమర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెద్దలకు తెలియకుండా ఎంగెజ్ మెంట్ కూడా చేసుకున్నారు. మూడు నెలల పాటు భార్యభర్తలమని చెప్పి ఒకే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో.. విష్ణు తన ఇంట్లో వారికి ఒప్పిస్తానని చెప్పి రాజస్థాన్ వెళ్లాడు.
కొంత మంది స్నేహం ముసుగులో అడ్డమైన చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. తమ అవసరాల కోసం ఎదుటి వారిని వాడుకుంటున్నారు. అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. వారిని లైంగికంగా వేధిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వెలుగులోనికి వస్తున్నాయి. కొంత మంది అమ్మాయిలు పాశ్చాత్య పోకడలకు పోయి.. లివ్ ఇన్ రిలేషన్ అంటూ ఆమోద యోగ్యం కానీ చెత్త పనులు చేస్తున్నారు.